గ్రామాలకు పచ్చతోరణం
గ్రామాలకు పచ్చనిహారాన్ని తొడిగినట్లు, పుడమి తల్లి పచ్చదనంతో పులకరించినట్లు మండలంలోని ఏ గ్రామం చూసినా హరితవర్ణంతో కళకళలాడుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.
- హరితహారంతో పెరిగిన పచ్చదనం
- రోడ్లకు ఇరువైపులా ఆకట్టుకుంటున్న చెట్లు
- తగ్గిన వాతావరణ కాలుష్యం
- మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పాలకవర్గాలు
డోంగ్లీ, సెప్టెంబర్ 28: గ్రామాలకు పచ్చనిహారాన్ని తొడిగినట్లు, పుడమి తల్లి పచ్చదనంతో పులకరించినట్లు మండలంలోని ఏ గ్రామం చూసినా హరితవర్ణంతో కళకళలాడుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో అంచనాలకు మించి మొక్కలను నాటారు. పచ్చదనం పరిఢవిల్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజల భాగస్వామ్యంతో కృషిచేస్తున్నారు.
డోంగ్లీ మండల పరిధిలో ఉన్న 13గ్రామ పంచాయతీల్లో విస్తారంగా మొక్కలను నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మండలంలో ఇప్పటి వరకు లక్షా 20వేల మొక్కలను నాటారు. వాటిలో దాదాపు 96వేల మొక్కలు పెరిగి ప్రస్తుతం వృక్షాలుగా మారాయి. గ్రామాల్లో ఇంటింటికీ పంపిణీ చేసిన సుమారు 46 వేల మొక్కల్లో ప్రస్తుతం 40వేల మొక్కలు సంరక్షిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన వాటిలో ప్రధానంగా మలబార్, బాదాం, మారేడు, గులాబీ, అల్లనేరేడు, జామ, బొప్పాయి, మునగ, కొబ్బరి, ఉసిరి, నిమ్మ, శ్రీగంధం, గన్నేరు తదితర మొక్కలు ఉన్నాయి.
వాటి సంరక్షణకు గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నాయి. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పల్లె ప్రకృతి వనాల్లో పెంచిన మొక్కలు చక్కటి వాతావరణాన్ని అందిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మొక్కలకు ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేస్తూ.. మొక్కల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత..
గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత అందరిపై ఉన్నది. నేడు మనం నాటిన మొక్కలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతా యి. పల్లె ప్రకృతి వనాలు చిట్టడివిని తలపిస్తున్నాయి. అధికారులు, గ్రా మస్తుల కృషితో హరితహారం విజయవంతంగా కొనసాగుతున్నది. దేశంలోనే తెలంగాణను రోడ్ మోడల్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
– మధుకర్ పటేల్, సర్పంచుల ఫోరం డోంగ్లీ మండల అధ్యక్షుడు
పచ్చదనంతో కనువిందు..
నాడు హరితహారంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి చూపరులకు కనువిందు చేస్తున్నా యి. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావడం సంతోషంగా ఉన్నది. వారి సహకారంతో గ్రామాల్లో నాటిన మొక్కలు సంరక్షించబడుతున్నాయి. నేడు నాటిన మొక్కలు భవిష్యత్తులో మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడుతాయి.
– సూర్యకాంత్ పాటిల్, సర్పంచ్, మొఘ
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

