ఓటర్ల తుది జాబితా సిద్ధం చేయాలి
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 26 నాటికి పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు.
- వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశం
ఖలీల్‌వాడి/ విద్యానగర్, డిసెంబర్ 14 : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 26 నాటికి పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 8వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో డాటా ఎంట్రీ పూర్తిచేసిన నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుం డా క్షుణ్ణంగా స్క్రూటినీ నిర్వహించాలన్నారు.
వచ్చే నెల జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉన్నందున, పరిశీలన ప్రక్రియలో జాప్యానికి తావు లేకుం డా చూడాలన్నారు. ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన ప్రగతిని సమీక్షించాలని సూచించారు. డూప్లికేషన్ ఓట్లు లేకుం డా పక్కాగా ఓటరు జాబితాను రూపొందించాలని, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఓటరు జాబితాలో పేరు ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు.
చెక్లిస్ట్ను రూపొందించుకొని బీఎల్వోలతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఓటరు జాబితాలో స్త్రీ, పురుష నిష్పత్తితోపాటు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల వివరాలను నమోదు చేయాలన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా 100 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న ఓటర్ల సంఖ్య 6,149 ఉందని, క్షేత్రస్థాయిలో ఆ వివరాలను సమగ్రంగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి.రవికిరణ్, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రమోహన్, నిజామాబాద్ జడ్పీ సీఈవో గోవింద్, బోధన్, కామారెడ్డి ఆర్డీవోలు రాజేశ్వర్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్, సాయి భుజంగరావు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- list of voters
- Voters
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

