కీరదోసకు భలే క్రేజ్
మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం కీరదోస. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. కీరదోస డీహైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం కూడా. చెమటతో కోల్పోయిన నీటిని లవణాలను శరీరానికి అందించడంలో చక్కని పాత్ర పోషిస్తుంది.
- ఆరోగ్యానికి భరోసానిస్తున్న కాయలు
- మనిషిలో కొవ్వు తగ్గించే గుణం
- బీపీ అదుపునకు దివ్యఔషధం
- వేసవిలో చల్లదనంతో మేలు
బాన్సువాడ, మే 3:మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం కీరదోస. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. కీరదోస డీహైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం కూడా. చెమటతో కోల్పోయిన నీటిని లవణాలను శరీరానికి అందించడంలో చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే శరీరం నిగారింపు సంతరించుకుంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కాలం ఏదైన అదే క్రేజీ..
ఏ కాలంలో అయినా అతి తక్కువ ధరకు లభించే కాయల్లో కీరదోస ఒకటి. వేసవితాపం నుంచి మనిషికి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తోపుడు బండ్లపై వీటిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. కాయను కోసి కాస్త, ఉప్పు, కారం చల్లి తింటుంటే ఆ మజాయే వేరు. కిలోకు రూ.20 నుంచి రూ.30 మధ్య లభిస్తుంది. ఎక్కువగా శుభకార్యాలు, పెండ్లి సమయంలో కాస్త ధర ఎక్కువగా ఉంటుంది.
కీరదోసతో లాభాలు..
- కీరదోసలో 95శాతం నీరు ఉండడంతో డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తవు.
- మనిషి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.
- కీరదోస పొట్టులో విటమిన్ సీ ఉంటుంది.
- ఇందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చు, తగ్గులకు సవరిస్తూ ఉంటుంది.
- వెంట్రుకల ఎదుగుదలకు కారణమైన సల్ఫర్, సిలికాన్ దోహదపడుతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
- కడుపులో మంట(ఎసిడిటి)ని తగ్గిస్తుంది.
- జీర్ణక్రియను మెరుగుపరుచడంలో దిట్ట.
- కీరదోస తోక్కలోను విటమిన్ కె సమృద్ధిగా ఉండడంతో చర్మానికి మేలు చేకూరుస్తుంది.
- ఒక దోసకాయ ముక్కని 30సెకండ్లపాటు నాలుకతో నోటికి పట్టుకొని ఉంటే చెడు శ్వాసకి కారణమైన బ్యాక్ట్టీరియాను చంపేగుణం ఉంటుంది.
- బరువు తగ్గాలనుకునే వారికి దీనిని మించిన ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు. కీరదోస పీచు ఎక్కువగా ఉండడంతో మలబద్దకం సమస్య తీరుతుంది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

