Asha workers | ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 15 నుండి సమ్మె.. సీఐటీయూ
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏవోకు సమ్మె నోటీసును మంగళవారం అంజేశారు.
Asha workers | ఖలీల్ వాడీ, నిజామాబాద్ 10 : తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏవోకు సమ్మె నోటీసును మంగళవారం అంజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆశ వర్కర్లు అత్యంత బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ప్రజలకు అనేక సేవలందిస్తూ గర్భిణీలను ఆసుపత్రిలో డెలివరీ అయ్యేవిధంగా చూస్తూ తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సీజనల్ వ్యాధులు అంటు వ్యాధులు రాకుండా ప్రయత్నిస్తున్నారని కరోనా మమ్మరిని అరికట్టడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సబ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారని ఇంత శ్రమ చేస్తున్న ఆశాలకు కేవలం 9,900 ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారని మండిపడ్డారు.
గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి పారితోషకాలు పెట్టకుండా ఉండటంతో నిత్యవసర సరుకులు ధరలు పెరిగి వ సరిపోవటం లేదని ఆయన అన్నారు 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు వాటిని పరిష్కరించలేదని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఆశలకు వేతనాలు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ మూడు సంవత్సరాలు అవుతున్న ఆశాల సమస్యలు పరిష్కరించలేదని, అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆశలకు నెలకు రూ.18 వేల వేతనం ఇచ్చి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ను చనిపోయిన వారికి రూ.50 వేలు మట్టి ఖర్చులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలని నిర్ణయించాలని, తదితర డిమాండ్లతో డిసెంబర్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధపడాల్సి వచ్చిందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లతో చర్చలు జరిపి సమ్మెను నివారించాలని ఆయన కోరారు. లేకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి సుకన్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రభుత్వాలు తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి’
Temple Device | టెంపుల్ పరికరం అంటే ఏమిటి.. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి..?
హెచ్చరిక సూచికలు నిల్… ప్రమాదాలు పుల్
పోలింగ్ కేంద్రాలను పెంచాలని అఖిలపక్షం తీర్మానం
Tamil Nadu | ఐఫోన్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

