Panchayat Elections | బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
Panchayat Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు.
కంటేశ్వర్ ( నిజామాబాద్ ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ( Vinay Krishna Reddy ) హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం( Elections Commission) నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.
అందరూ ఐకమత్యంగా ఉంటూ, సమష్టి నిర్ణయం ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ( Unanimously ) ఎన్నుకుంటే అది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. అందుకు భిన్నంగా డబ్బుల ప్రలోభాలు చూపి, భయ భ్రాంతులకు గురి చేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేయించే ప్రయత్నాలను ఎంతమాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఇది ఎన్నికల వ్యవస్థకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని అన్నారు. ఈ తరహా సంప్రదాయానికి చరమగీతం పాడుతూ, స్వేచ్చాయుత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవాల విషయంలో నూతన నియమ నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు.
ఏకగ్రీవ ఎన్నిక అని నిర్ధారణ చేయడానికి ముందు ‘తప్పనిసరి ధృవీకరణ’ విధానాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. ఏకగ్రీవాల వెనుక ఎలాంటి అంశాలు దాగి ఉన్నాయి అన్నది పరిశీలించేందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోటీలో మిగిలి ఉన్న ఏకైక అభ్యర్థితో పాటు, పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థుల నుంచి లిఖిత పూర్వకంగా డిక్లరేషన్ తీసుకోంటామని పేర్కొన్నారు. వాటిని జిల్లా ఎన్నికల అథారిటీ క్షుణ్ణంగా పరిశీలించి, సమష్టి నిర్ణయంతో ఏకగ్రీవం అయ్యిందని నిర్ధారణ చేసుకుని నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తారని వివరించారు. ఆ తరువాతే ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఈ క్రమంలో ఎక్కడైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఏకగ్రీవం చేసినట్లు నిర్ధారణ జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సదరు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎన్నిక, ప్రతి గెలుపు ప్రజల అభిప్రాయాన్ని నిజాయితీగా ప్రతిబింబించేలా ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

