Bhanswada | ఎర్రమన్నుకుచ్చలో నాటు బాంబులు పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామపంచాయతీ పరిధిలోనీ ఎర్రమన్ను కుచ్చ కాలనీలోకి ఆదివారం నాటు బాంబులు పేలి ఆరుగురు తీవ్ర గాయాల పాలైన ఘటన చోటుచేసుకుంది.
Bhanswada | బాన్సువాడ రూరల్, నవంబర్ 1 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామపంచాయతీ పరిధిలోనీ ఎర్రమన్ను కుచ్చ కాలనీలోకి ఆదివారం నాటు బాంబులు పేలి ఆరుగురు తీవ్ర గాయాల పాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎర్రమన్ కుచ్చా ప్రాంతానికి చెందిన దాసరి లక్ష్మయ్య ఇంటి వద్ద మోపెడ్‌లో పందుల వేట కోసం నిల్వ ఉంచిన నాటు బాంబులు ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలినట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు
. ఈ ఘటనలో దాసరి లక్ష్మయ్యతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. పేలుడులో గాయపడిన వారిని స్థానికులు వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల పూర్తి కారణాలు, బాంబుల నిల్వ వెనుక ఉన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాటు బాంబులు పేలి భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

