Rare surgery | మూడు రోజుల బాబుకు అరుదైన శస్త్ర చికిత్స .. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
Rare surgery | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ ఆసుపత్రిలో మూడు రోజుల మగ శిశువుకు అరుదైన లేపరోటమి కోలస్టమి శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేశారు.
కంటేశ్వర్ :నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ ఆసుపత్రిలో ( Wellness Hospital ) మూడు రోజుల మగ శిశువుకు అరుదైన లేపరోటమి కోలస్టమి శస్త్ర చికిత్స ( Laparotomy colostomy surgery ) ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్( Doctor Devendar ) బుధవారం ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ మెట్పల్లి ఇబ్రహీంపట్నంకు చెందిన గంగా ప్రవళిక గత నెల జులై 25 న డెలివరీ అయిన తర్వాత పుట్టిన బాబుకు మల విసర్జన( మోషన్) రాకపోవడంతో జులై 28న జిల్లా కేంద్రంలోని వెల్నెస్ హాస్పిటల్‌కు తీసుకువచ్చినట్టు వివరించారు. బాబుకు అన్ని రకాల పరీక్షలు చేశాక ఇంతస్ట్రైనల్ అబ్స్ట్రక్షన్ చిన్న పేగులో దూరడంతో కడుపులో నొప్పితో పాటు యూరిన్, స్టోల్ సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా వైద్యుల బృందం లాపరోటమీ అనే సాధారణ చికిత్స విధానం ద్వారా ఉదర అవయవాలను పరిశీలిస్తూ కొలోస్టమీ అనే నిర్దిష్ట రకమైన స్టోమా శస్త్ర చికిత్స ద్వారా మలం బయటకు వెళ్లడానికి పెద్దప్రేగులో ఓపెనింగ్ (స్టోమా)ను సృష్టించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు.
ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ , ఆపరేషన్ హెడ్ హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నతమైన వైద్యం అందించే లక్ష్యంగానే నిజామాబాదులో వెల్నెస్ హాస్పిటల్ ఏడవ బ్రాంచ్‌ను ప్రారంభించామని తెలిపారు. తమ హాస్పిటల్ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటారని ఏ సమయంలో వచ్చిన ఎటువంటి సమస్యకైనా అవసరమైన అత్యవసర చికిత్స అందిస్తామని తెలిపారు.
అతి తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాదులోనే పూర్తిస్థాయి వైద్యం అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని, జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. బాబు తల్లి గంగా ప్రవళిక మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో, అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులకు, వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనస్తేషియా వైద్యురాలు శృతి శైని, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

