Arya Vysya Mahasabha | ఆర్మూర్ టౌన్ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ఆర్మూర్ పట్టణానికి చెందిన పోలా సుధాకర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తనపై నమ్మకం తెచ్చిన పదవిని నమ్మకాన్ని వమ్ము చేయకుండా నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు. సభలకు వచ్చే ఆర్యవైశ్యు మహాసభలకు వచ్చే ఆర్యవైశ్యులు పూర్తిస్థాయిలో సహకరించాలని తెలిపారు సహకరించినట్లయితే సభలు విజయవంతవుతాయని తెలిపారు.