Rugby Competitions | జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పెద్దకొడపుగల్ విద్యార్థి ఎంపిక.. తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న క్రిష్ణ
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి బీ క్రిష్ణ జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యాడు. ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాలుర రగ్బీ విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.
Rugby Competitions | పెద్ద కొడప్ గల్, అక్టోబర్ 19 : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి బీ క్రిష్ణ జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యాడు. ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాలుర రగ్బీ విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఎంబీ హోమ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో బీ క్రిష్ణ ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సత్యం వెల్లడించారు.
ఈ ప్రతిభ ఆధారంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రిష్ణ ఈ నెల 23 నుంచి 28వరకు ఢిల్లీలో నిర్వహించనున్న పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననున్నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీ కమల తెలిపారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థి క్రిష్ణను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anna Konidala | పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసిన అన్నా
Shaji Kumar | మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత!
Vijay Sethupathi | వరుస సినిమాలతో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ దండయాత్ర.. రెండు నెలల్లో రెండు చిత్రాలు..!
Scene Movie | సీన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 150 కోట్లు దాటిన సూర్య సినిమా!
Ramayana | 5 రోజుల్లో రూ. 663 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘రామాయణం’!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

