‘కనీస మద్దతు ధర కమిటీ’ని బహిష్కరించాం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించినట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు తెలిపారు. ఆర్మూర్‌లో మంగళవారం ఆయన రైతుసంఘాల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం నియమించిన
కోటపాటి నర్సింహానాయుడు
ఆర్మూర్, జూలై 19 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించినట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు తెలిపారు. ఆర్మూర్‌లో మంగళవారం ఆయన రైతుసంఘాల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం నియమించిన కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుని.. ఉద్యమాన్ని విరమించాలని రైతు సంఘాలను కోరిందన్నారు.
ఈ సందర్భంలో గత నవంబర్ నెలలో ఒక కమిటీని వేసిందని చెప్పారు. రైతు సంఘాల సూచనల మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. సంవత్సరం పాటు కాలయాపన చేసిన కేంద్రం తమకు అనుకూల సంఘాల నుంచి 26 మందిని నియమించి కేవలం ముగ్గురిని మాత్రమే సంయుక్త కిసాన్ మోర్చా నుంచి తీసుకోవడానికి పేర్లు ఇవ్వాలని కోరిందని తెలిపారు. ఏడాది కాలయాపన చేసి ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఈ కమిటీలోకి రైతు ప్రతినిధులను పంపకూడదని అఖిల భారత రైతు సంఘాలు నిర్ణయించినట్లు కోటపాటి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ భజనపరులతో కూడిన సభ్యులను తొలగించి కొత్తగా సంయుక్త కిసాన్‌మోర్చా ప్రతినిధులను ఎక్కువ సంఖ్యలో తీసుకుని ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. సం ఘం ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు నక్కల చిన్నారెడ్డి, రైతు నాయకుడు కుంట గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

