మైనర్లు బండి నడిపితే తల్లిదండ్రులకూ జైలు
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతోనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతాకుంచాల అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, పోలీసు శాఖ సంయుక్తంగా మైనర్ డ్రైవింగ్- డ్రంకెన్ డ్రైవింగ్ అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
- మైనర్లకు వాహనాలు ఇచ్చి శిక్షకు గురికావొద్దు
- జిల్లా జడ్జి సునీతా కుంచాల
కంఠేశ్వర్, జూలై 20: నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతోనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతాకుంచాల అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, పోలీసు శాఖ సంయుక్తంగా మైనర్ డ్రైవింగ్- డ్రంకెన్ డ్రైవింగ్ అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ వారికుటుంబాలతోపాటు ఇతరులకు తీరని నష్టం చేకూ రుస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కఠిన చట్టాలు అమలులోకి తెచ్చిందని, మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులు నేరస్తులుగా పరిగణించబడతారని అన్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే వారితోపాటు తల్లిదండ్రులకు మూడేండ్ల కారాగార శిక్ష, రూ.25వేల వరకు జరిమానా ఉంటుందన్నారు. సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ మాట్లాడుతూ జిల్లాలో ఏడాదిన్నర కాలంలో రోడ్డుప్రమాదాల్లో 550 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్, కారు నడిపే వారు విధిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు. ఆగస్టు 15 తర్వాత హెల్మెట్ నిబంధనలు తప్పనిసరి చేస్తామని, ధరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదస్సులో 7వ బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు బస్వారెడ్డి, శ్రీనివాస్, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

