నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రాపర్టీ షోకు రెండోరోజు సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం ప్రారంభమైన ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. ప్రాపర్టీ షోలో పలు ప్రముఖ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద తమ కలల గృహాల కొనుగోలుతోపాటు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలు, నగర శివారు ప్రాంతాల్లోని ప్లాట్ల గురించి తమ ఆసక్తికి అనుగుణంగా ఆయా సంస్థల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి విశేషాలను తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి వివరాలను ఒకే వేదికపై తెలుసుకునేలా ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని సందర్శకులు హర్షం వ్యక్తంచేశారు.
నాలుగు బెడ్రూంల ఇండ్లు ఉన్నాయి..
హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో అధునాత హంగులతో అమృత ప్రాజెక్టును నిర్మించాం. ఇందులో సింగిల్, డబుల్ బెడ్రూమ్లతోపాటు 3,4 బెడ్రూమ్ల ఫ్లాట్స్ ఉన్నాయి. మూడు రకాల ప్రాజెక్టులు ఉండగా వీటి ధర రూ.1.5కోట్ల ధర ఉన్నది.
– దినేశ్‌కుమార్, అమృతా ప్రాజెక్ట్, కొంపల్లి
రూ.50లక్షలకే విల్లా..
ఏవీ డెవలపర్స్ ఆధ్వర్యంలో విల్లాస్‌లో వాస్తుకు అనుగుణంగా విశాలమైన గదులను నిర్మించాం. దీని ధర రూ.50లక్షలకు పైగా పలుకుతున్నది. ఆహ్లాదకరమైన వాతావరణంలో విల్లాస్ నిర్మించాం.
– శ్రావణ్‌కుమార్, ఏవీ డెవలపర్స్
అన్నిరకాల ఇంటీరియర్స్..
జిల్లా కేంద్రంలో అత్యాధునికంగా ఇంటీరియర్స్ ఉన్నాయి. డోర్స్, విండోస్ తదితర వస్తువులు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న గురురాఘవేంద్ర ఇంటీరియర్స్‌ను సంప్రదించాలి.
– నాగ మల్లిక, గురురాఘవేంద్ర ఇంటీరియర్స్
సామాన్యుడికి అందుబాటులో..
జిల్లా కేంద్రంలోని అశోక టవర్స్, బిల్డర్స్, అపార్ట్‌మెంట్స్‌లో అతి తక్కు వ ధరలకే భవనాలు అందుబాటులో ఉన్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా అశోక బిల్డ ర్స్ ధరల ను నిర్ణయించింది. సుమారు రూ.39 లక్షల నుంచి రూ.40లక్షలకు పైన పలుకుతున్నాయి.
– సునీల్, సైట్ ఇన్చార్జి, అశోక బిల్డర్స్ అండ్ అపార్ట్మెంట్
స్పందన బాగున్నది..
విలాస వంతమైన కట్టడాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. చాలా మంది స్టాల్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని సాకేత్ అపార్ట్మెంట్స్, విల్లాస్‌లో ప్రజలకు అందుబాటు ధరల్లో ఇండ్లు లభిస్తున్నాయి. విల్లాస్‌లో రూ.కోటి, అపార్ట్మెంట్లో రూ.59లక్షల వరకు ధర ఉన్నది.
– ఆదర్శ, సాకేత్ అపార్ట్మెంట్స్, విల్లాస్, హైదరాబాద్
ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రుణం..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఆస్తులు కొనుగోలు చేసేవారికి రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఔత్సాహికుల సిబిల్ స్కోర్, ఆదా యం ఆధారంగా 8.6శాతం వడ్డీతో రుణం మంజూరు చే స్తాం. మా వద్ద ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నాం.
– ప్రశాంత్, అసిస్టెంట్ మేనేజర్, యూనియన్ బ్యాంక్
90 ఇండ్లు రెడీ..
హైదరాబాద్ సమీపంలోని కొంపల్లి శివారులో అత్యాధునికంగా ఇండ్లను నిర్మిస్తున్నాం. అతి తక్కువ ధరకు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకువచ్చాం. సామాన్యులు సైతం ముందుకు వచ్చి అందుబాటులో ఉన్న ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం 90 ఇండ్లు ఉండగా, డబుల్ బెడ్రూం ఇల్లు రూ.56లక్షలు, 3బెడ్రూం ఇంటి ధర రూ.67లక్షలు పలుకుతున్నది.
– రాహుల్, హరిదా హరివిల్లు, హైదరాబాద్
తక్కువ వడ్డీతో సోలార్ ప్లాంట్..
అతి తక్కువ వడ్డీతో సోలార్ ప్లాంట్ అందుబాటులో ఉన్నది. 25 ఏండ్ల వరకు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగిలిన కరెంటును విక్రయించుకునే సౌకర్యం ఉంటుంది. ప్లాంట్ ఏర్పాటుకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం ఉంటుంది.
– భూపతిగౌడ్, అక్షయ ఎంటర్ప్రైజెస్
అమ్మకానికి ఓపెన్ ప్లాట్స్
శిల్పారాఘవలో ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మేము ఆరు ప్రాజెక్టులను చేపడుతున్నాం. అతి తక్కువ ధరలో ప్లాట్లు లభ్యమవుతున్నాయి.
– పవన్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, శిల్పారాఘవ
సరసమైన ధరల్లో లభ్యం..
ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా ఇంపోర్టెడ్ వస్తువులను ప్రదర్శనకు ఉంచాము. నగరంలోని బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఓక్ లో గృహ అవసరాలకు కావాల్సిన వస్తువులు సరసమైన ధరల్లో లభ్యమవుతా యి. విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన గృహ వస్తువులు, మౌంటేన్ లాంటి డెకరేషన్స్ విక్రయిస్తున్నాం.
– రఘుధీర్రెడ్డి, రాయల్ ఓక్ నిర్వాహకుడు
ప్రాపర్టీ షోతో ప్రజలకు ఎంతో మేలు
జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహించిన ప్రాపర్టీ షోతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుం ది. ఒకే వేదికపై అన్ని రకాల నిర్మాణ సంస్థలు ఉండడం అభినందనీయం. నచ్చిన ప్లాట్లు, రుణ సౌకర్యం కల్పించడం కొనుగోలుదారుడికి సులువైన మార్గం.
-రాజు, సందర్శకుడు, నందిపేట్