Interview | ప్రజలే నా దేవుళ్లు.. గెలిపించారు.. మళ్లీ గెలిపిస్తారు : జాజాల సురేందర్
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన.. అసెంబ్లీలోకి మొదటిసారి అడుగుపెట్టింది మాత్రం 2018లోనే. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరుబాట పట్టిన ఆయన గులాబీ దళపతి కేసీఆర్ వెంట నడిచినప్పటికీ 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా నియోజకవర్గంలోని ప్రజలతోనే ఉంటూ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.
- ప్రజా సేవ చేయడం నా అదృష్టం
- నియోజకవర్గంలో ప్రగతి పరుగులు
- ఆడపడుచులకు పట్టుచీర, ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ నా బాధ్యత
- టీఆర్ఎస్ ఆవిర్భావమే నా రాజకీయాలకు పునాదిరాయి
- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన.. అసెంబ్లీలోకి మొదటిసారి అడుగుపెట్టింది మాత్రం 2018లోనే. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరుబాట పట్టిన ఆయన గులాబీ దళపతి కేసీఆర్ వెంట నడిచినప్పటికీ 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా నియోజకవర్గంలోని ప్రజలతోనే ఉంటూ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం నియోజకవర్గ ప్రగతి కోసం, తన రాజకీయ ప్రవేశానికి కారణమైన బీఆర్ఎస్లోకి వచ్చారు. నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిన ఆయనకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ప్రస్తుతం తొలిసారి అవకాశం వచ్చింది. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు పాటుపడుతున్న ఆయనే.. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ఎల్లారెడ్డిని అభివృద్ధి పథంలో నిలిపిన తనను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా గెలిపిస్తారంటున్న జాజాలతో నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ..
– ఎల్లారెడ్డి, ఆగస్టు 24
నమస్తే తెలంగాణ : మీ రాజకీయ ప్రస్తానం ఎలా మొదలైంది?
ఎమ్మెల్యే జాజాల : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే సంకల్పంతో కేసీఆర్ జెండా పట్టినప్పుడే నేను ఉద్యమంలోకి వచ్చాను. సార్ వెంటనే నేను ఉద్యమంలో భాగంగా తిరిగాను. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి పల్లెనూ చుట్టివచ్చాను. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశాను. 2004లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితుల కారణంగా టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాను. అనంతరం టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోకి మారాల్సి వచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేశాను. 2018లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశాను. 2018లో నా ఎన్నికల డిపాజిట్ డబ్బులు సైతం ప్రజలే చెల్లించి, లక్షలాది రూపాయల విరాళాలు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించారు. అందుకే అభివృద్ధి చేయాలనే కాంక్షతోనే తిరిగి తనకు రాజకీయ రంగ ప్రవేశానికి కారణమైన బీఆర్ఎస్లో చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవే పరమావధిగా వారికి సేవ చేసుకుంటున్నాను. ప్రజల సేవలో ఉన్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయి..
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరేలా నిత్యం కృషి చేస్తున్నందున ప్రజలే నాకు అవకాశం ఇస్తారు. పెండింగ్‌లో ఉన్న కోట్ల రూపాయల అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నాను. ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులే దీనికి నిదర్శనం. ప్రతి గ్రామానికీ రోడ్డును బాగు చేయించాను. ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద రెండు బ్రిడ్జిల ఏర్పాటు కారణంగా నిత్యం వందలాది మందికి ఇబ్బందులు లేకుండా పోయాయి. ఎవరు అనారోగ్యం బారినపడినా నేనే స్వయంగా స్పందించి ఎల్వోసీలు ఇస్తున్నాను. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారనే నమ్మకం ఉంది.
నియోజకవర్గంలో ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటీ?
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నాయకులు స్థానికులు కాదు. వారిలో ఎవరికీ ప్రజాబలం లేదు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను నమ్మి ప్రజలు ఓటు వేస్తారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నందున జిల్లాలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఇప్పటికే పేర్కొంటున్నారు. అభివృద్ధి కావాలని కోరుకుంటున్న తరుణంలో ఇతర పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా దక్కదు. బీఆర్ఎస్ గెలుపును ఆపే దమ్ము ఎవరికీ లేదు.
ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోటీ చేశారు?
2004లో మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. 2008లో వచ్చిన ఉపఎన్నికల్లో, 2010లో టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచాను. 2014లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమిచెందాను. 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 35వేల మెజారిటీతో విజయం సాధించాను. నియోజకవర్గ ప్రజలు అందించిన భారీ విజయానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎల్లారెడ్డిలోనే ఉంటూ ప్రజా సేవ చేసుకుంటున్నాను.
నియోజకవర్గంలో విద్యా, వైద్య సేవలు ఎలా ఉన్నాయి..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మెరుగైన వైద్య సేవల కోసం సీఎం కేసీఆర్ ఎంతో సహకరిస్తున్నారు. వంద పడకల వైద్యశాల ఏర్పాటుకు రూ.10కోట్లు మంజూరు చేశారు. నిధులు మంజూరైన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావ్ వచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. దీంతో నియోజకవర్గంలోని వేలాది మందికి వైద్యం చేరువ అయ్యింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల, ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. దీంతో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతున్నది.
పట్టుచీరల పంపిణీపై మీ అభిప్రాయం..
నియోజకవర్గ ప్రజలు నన్ను నన్నుగా ఆదరించి గెలిపించారు. ప్రతి ఇంటి నుంచి నాకు ఓటు పడింది. సీఎం కేసీఆర్ ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రూపంలో రూ.లక్షా116 ఇస్తున్న నేపథ్యంలో నా వంతుగా పట్టుచీరను ఇస్తున్నాను. ఇది నా అక్కాచెల్లెండ్లకు ఇస్తున్నట్లుగా ఫీలవుతున్నాను. ఇప్పటి వరకు సుమారు 12వేల మంది ఆడపడుచులకు పట్టుచీరలను పంపిణీ చేశాను. అది కూడా నాకు దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ప్రభుత్వం ఇస్తున్న వేతనాన్ని అందుకు ఖర్చు చేస్తున్నాను. నాలుగేండ్లలో ప్రభుత్వం నుంచి వచ్చిన వేతనాన్ని పూర్తిగా దానికోసమే ఖర్చు చేశాను.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

