రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి
దవాఖానకు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు తగిన సదుపాయాలు కల్పించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ఏరియా దవాఖానలో మాజీ స్పీకర్ పోచారం ఆకస్మిక తనిఖీ
బాన్సువాడ టౌన్, జూన్ 20: దవాఖానకు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు తగిన సదుపాయాలు కల్పించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే, బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించారు. రోగులు, విద్యార్థులతో పాటు ముచ్చటించిన ఆయన అందుతున్న సేవలపై ఆరా తీశారు.
ఇప్పుడున్న ఏరియా దవాఖాన పాత భవనాన్ని కూల్చేసి రూ.37 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఉర్దూ కళాశాలలో వైద్యమందిస్తున్నామని చెప్పారు. కాస్త ఇబ్బందిగా ఉన్నా సాధ్యమైనంత వరకు రోగులకు మంచి వైద్య సదుపాయాలు కల్పించాలని సూపరింటెండెంట్ శ్రీనివాస్ప్రసాద్కు సూచించారు. అదనపు తరగతి గదుల నిర్మాణంతో విద్యార్థుల సంఖ్య పదింతలు పెరిగినా ఇబ్బందులు ఉండవన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మధ్యాహ్న భోజనం వండుతున్న క్రమంలో పోచారం గంటె తిప్పారు. నర్సింగ్ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని నర్సింగ్ విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సరిపడా బోధన సిబ్బంది లేరని, సిలబస్ పూర్తి చేయడానికి ఇబ్బందిగా ఉందని ప్రిన్సిపాల్ భూలక్ష్మి చెప్పగా, అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని పోచారం హామీ ఇచ్చారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

