ఆర్మూర్‌టౌన్/ ఆర్మూర్,అక్టోబర్31: తన గెలుపు ఆర్మూర్ అభివృద్ధికి మరో మలుపు అని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని గురడి రెడ్డి ఫంక్షన్హాల్లో ఆర్మూర్ నియోజకవర్గ గురడి రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ప్రగతికి మారుపేరని, కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే నష్టపోతామన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో సబ్బండవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తాను ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదని, పదేండ్లుగా మీ జీతగాడిలా పనిచేశానని అన్నారు.
ఆర్మూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చి ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చానని తెలిపారు. ఆర్మూర్ అభివృద్ధి ఉట్టిపడేలా తొమ్మిదికిపైగా బైపాస్ రోడ్లు వేయించానని వివరించారు.రూ.20కోట్లతో సిద్ధులగుట్టకు ఘాట్‌రోడ్ వేయించి పరమశివుని దివ్యక్షేత్రాన్ని దేదీప్యమానంగా చేశానన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే నష్టపోతామన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, నందిపేట ఎంపీపీ సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.