కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే అధోగతే
తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని ఆర్మూర్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ‘ నమస్తే నవనాథపురం ’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆర్మూర్ మండలంలోని మగ్గిడి, ఖానాపూర్ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు.
- తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష
- ఆర్మూర్‌ను అభివృద్ధికి అడ్డాగా మార్చిన..
- మూడోసారి ఆశీర్వదించండి.. జీతగాడిలా పనిచేస్తా
- ‘నమస్తే నవనాథ పురం’లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
ఆర్మూర్, అక్టోబర్14; తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని ఆర్మూర్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ‘ నమస్తే నవనాథపురం ’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆర్మూర్ మండలంలోని మగ్గిడి, ఖానాపూర్ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. పిప్రి గ్రామం నుంచి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులతో కలిసి జీవన్‌రెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీగా గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో జీవన్‌రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఎన్నిక ప్రచారంలో భాగంగా గ్రామంలోని వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మగ్గిడి, ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన సభల్లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ… ఇప్పటి వరకు మగ్గిడి గ్రామానికి రూ.27కోట్లు, ఖానాపూర్ గ్రామానికి రూ.21కోట్ల నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. గ్రామాల్లో ఎటు చూసినా అభివృద్ధి, సంక్షేమమే కనిపిస్తోందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏనాడైనా మీ ఊళ్లను పట్టించుకున్నారా అని గ్రామస్తులను ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే అధోగతే అని పేర్కొన్నారు. దేశమే అబ్బురపడేలా కొనసాగుతున్న కేసీఆర్ పాలన చూసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. మగ్గిడి, ఖానాపూర్ గ్రామాల్లో ప్రగతి నివేదికను ప్రజల ముందు చదివి విన్నిపించారు. బీఆర్ఎస్ అంటేనే 24గంటల ఉచిత విద్యుత్ అని, కాంగ్రెస్ అంటే మూడు గంటల కరెంట్ అని అన్నారు.
బీఆర్ఎస్ అంటే వరి కోతలు అని, కాంగ్రెస్ అంటే కాల్చివేతలు, కూల్చివేతలు, ప్రజల గుండెల్లో కోతలన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కడుపు నింపేది బీఆర్ఎస్ మేనిఫెస్టో అని, ప్రజల కడుపులు కొట్టేది కాంగ్రెస్ మేనిఫెస్టో అని అన్నారు. ఆర్మూర్‌ను అభివృద్ధికి అడ్డాగా మార్చానని, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్ మూడో సారి సీఎం కావాలని, మళ్లీ బీఆర్ఎస్దే అఖండ విజయమన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు తెలంగాణకు చేటు అని పేర్కొన్నారు.కార్యక్రమంలో పిప్రి సొసైటీ చైర్మన్ సోమ హేమంత్‌రెడ్డి, మగ్గిడి సర్పంచ్ సుమలతా నర్సయ్య, ఖానాపూర్ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్ , బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

