ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత..
విద్యార్థులను పరామర్శించిన స్పీకర్..నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశాలు

బాన్సువాడ : మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం తిన్న సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నా ఏజెన్సీ నిర్వహకులు వంట చేసి 100 మంది విద్యార్థులకు వడ్డించారు. ఉపాధ్యాయులు కూడ పాఠశాలలో భోజనం చేశారు. భోజనం తిన్న వారిలో 30 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, తలతిప్పినట్లవడంతో వారిని బాన్సువాడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. విద్యార్థులను ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రామ్ రెడ్డి, సర్పంచ్ నారాయణ రెడ్డి, ఎంపీటీసీ హన్మాండ్లు, ఎంఈవో, తాసీల్దార్ గంగాధర్ గ్రామానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకొని విద్యార్థులను దవాఖానకు తరలించారు.
విద్యార్థులను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ , డాక్టర్ సంతోష్ కుమార్లు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు లేవని, పూర్థిస్థాయిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా విషయం తెలుసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం రాత్రి దవాఖానకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

