Panchayat Elections | మల్లుపల్లిలో ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.. ఎందుకంటే..?
Panchayat Elections : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ ఓ ఊరి ప్రజలు మాత్రం నిరసన గళం వినిపిస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపకుండా నిర్వహించ తలపెట్టిన ఎలక్షన్స్‌ను బహిష్కరించారు.
Panchayat Elections : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ ఓ ఊరి ప్రజలు మాత్రం నిరసన గళం వినిపిస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపకుండా నిర్వహించ తలపెట్టిన ఎలక్షన్స్‌ను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని మల్లుపల్లి (Mallupalli) ప్రజలు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్న గ్రామస్తుల మనసు మార్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
గ్రామంలోని సమస్యలను గాలికి వదిలేయడమే కాకుండా.. జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో మల్లుపల్లి గ్రామస్తులు విసుగు చెందారు. తమ సమస్యలు అధికారుల దృష్టికి రావాలంటే పంచాయతీ ఎన్నికలు బహిష్కరించడమే సరైన నిర్ణయమని భావించారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లిలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు
గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో విసుగు చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం
డిసెంబర్ 11వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్, వార్డు సభ్యులు… pic.twitter.com/b2spne4Vu2
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2025
తమ గ్రామంలో డిసెంబర్ 11వ తేదీన జరగనున్న ఎన్నికలకు సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా శనివారం పంచాయతీ కార్యాలయం ముందు వారంతా ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మల్లుపల్లి గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడి.. బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

