స్టెరాయిడ్స్ ఇస్తూ చంపేందుకు యత్నం
కలెక్టర్‌కు భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలు
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 7 : అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని భార్య నిజామాబాద్ కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆర్మూర్ పట్టణానికి చెందిన స్రవంతికి గంగాసాగర్‌తో 2017లో వివాహం అయ్యింది. ప్రస్తుతం వారికి నాలుగేండ్ల బాబు ఉన్నాడు. బాబు పుట్టిన నెల రోజుల నుంచే భర్తతో పాటు అత్త సరస్వతి, మామ గంగాధర్ అదనపు కట్నం తీసుకురావాలంటూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. స్రవంతికి స్కిన్ ఎలర్జీ ఉండడంతో చికిత్స పేరుతో గంగాసాగర్ స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తూ అరాచకానికి పాల్పడుతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై జనవరి 24వ తేదీన ఆర్మూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. న్యాయం జరగకపోగా ఫిర్యాదును తారుమారు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. స్టెరాయిడ్స్ ఇస్తున్న విషయాన్ని బంధువులకు చెప్పడంతో కత్తితో చంపేందుకు వచ్చాడని వాపోయింది. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానలో కంపౌండర్‌గా పని చేస్తున్న తన భర్త గంగాసాగర్ ఎటువంటి అనుమతులు లేకుండా ఆర్ఎంపీగా క్లినిక్ నిర్వహిస్తున్నాడని ఆమె తెలిపింది. తన భర్త తరఫున వచ్చిన ఓ వ్యకి తరచూ ఫోన్ చేసి మీరు ఎక్కడికి వెళ్లినా తమకు ఏమీ కాదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న భర్త, అత్త, మామలపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ బాధితురాలు స్రవంతి సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
- Tags
- kamareddy news
- Steroids
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

