ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
వాహనాల అద్దె డబ్బుల బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి ట్రాన్స్‌కో ఏఈ రాజు ఏసీబీ వలకు సోమవారం చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భైరవస్వామి అనే వ్యక్తికి రెండు వాహనాలు ఉన్నాయి.
- కాంట్రాక్టర్‌కు డబ్బుల డిమాండ్
- రూ.12,500 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
కామారెడ్డి, జనవరి 8: వాహనాల అద్దె డబ్బుల బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి ట్రాన్స్‌కో ఏఈ రాజు ఏసీబీ వలకు సోమవారం చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భైరవస్వామి అనే వ్యక్తికి రెండు వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలను ట్రాన్స్‌కో డిపార్ట్మెంట్కు నడిపించేందుకు నెలకు ఒక్కో వాహనానికి రూ.61వేల అద్దెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ బిల్లులను ట్రాన్స్‌కో ఏఈ రాజు ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. మూడు బిల్లులకు రూ.12,500 డిమాండ్ చేయగా భైరవస్వామి ఏసీబీని ఆశ్రయించాడు.
పథకం ప్రకారం తాను అడిగిన డబ్బులను తన స్నేహితుడు సంతోష్ అనే వ్యక్తికి ఓ జిరాక్స్ సెంటర్లో ఇవ్వాలని భైరవస్వామికి ఏఈ రాజు సూచించాడు. సంతోష్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ రాజు, అతని స్నేహితుడు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఆయన వెంట ఏసీబీ ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్, శ్రీనివాస్ ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

