Hanmanth Shinde | జుక్కల్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి.. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
జుక్కల్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Hanmanth Shinde | పెద్ద కొడప్ గల్ (జుక్కల్), ఆగస్టు 27 : జుక్కల్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యలపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మండలంలోని మహ్మదాబాద్ చౌరస్తా నుండి జుక్కల్ చౌరస్తా వరకు గురువారం పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ చౌరస్తా నుండి కండెబాల్లూరు వరకు రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించి బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సైతం పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రపోతోందని, అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే గుర్తించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2015-16లో రహదారిని వెడల్పు చేసి బీటీ రోడ్డు నిర్మించామని, రోడ్డు మరమ్మతులకు రావడంతో తమ ప్రభుత్వ హయాంలో రోడ్డు పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. జుక్కల్ చౌరస్తా నుండి కండెబాల్లూరు వరకు రోడ్డు పనులను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు సురక్షితమైన రహదారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల కోసం,అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర కొనసాగుతోందని ఆయన చెప్పారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

