భావి శాస్త్రవేత్తలకు ఆహ్వనం
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణల దిశగా వారిని ప్రోత్సహించి భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
- శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహం
- ఒక్కో పాఠశాల నుంచి ఐదు మాత్రమే స్వీకరణ
- సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులకు గడువు
- ఎంపికైన వారికి రూ.20 వేల నుంచి రూ.30వేలు అందజేత
కామారెడ్డి, జూలై 13 ; విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణల దిశగా వారిని ప్రోత్సహించి భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్లో ఆతిథ్యం, దేశ ప్రథమ పౌరుడితో అభినందనలు, కేంద్ర మంత్రులతో ప్రశంసలు, దేశ దిగ్గజ శాస్త్రవేత్తలతో సమాలోచనలు వంటి అవకాశం కలుగుతుంది.
ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్ట్లు..
ఇన్స్పైర్ మనక్ కార్యక్రమంపై ఎంఈవో, కాంప్లెక్స్ హెచ్ఎం,హెచ్ఎం,ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఇప్పటికే అవగాహన కల్పించింది. జిల్లాలోని ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఒక్కో పాఠశాల నుంచి 5 నామినేషన్లు మాత్రమే పంపేందుకు అవకాశం ఉంటుంది. ప్రయోగానికి సంబంధించిన చిత్రాలు, వివరాలు, వీడియోలు, పాఠశాల యూడైస్ నంబర్, ఈ మెయిల్, విద్యార్థి ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా, గైడ్ ఉపాధ్యాయుడు, హెచ్ఎం మొబైల్ నంబర్లు తదితర వివరాలను సెప్టెంబర్ 15వ తేదీలోగా వెబ్సైట్ (www.inspireawards-dst.gov.in) ద్వారా స్కూల్ అథారిటీ లాగిన్లో ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్ , కేజీబీవీల్లోని విద్యార్థులు 10 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 6 నుంచి 10వ తరగతి వరకు చదివే వారు అర్హులు.
ప్రతిభావంతులకు పారితోషికం..
విద్యార్థులు పంపిన ప్రాజెక్టులను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీకి చెందిన కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు. ఎంపికైన విద్యార్థులకు రూ.10వేలు అందజేస్తారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైతే రూ.25వేలు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైతే రూ.40వేల నుంచి రూ.60వేల నగదు ప్రదానం చేస్తారు. ఉత్తమ ప్రాజెక్టుపై మేధో సంపత్తి హక్కులు సైతం కల్పిస్తారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారంతోపాటు ఐఐటీ ప్రవేశాల్లో రిజర్వేషన్ వర్తింపజేస్తారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరంలో 76 ప్రాజెక్టులు జిల్లాస్థాయికి ఎంపికవ్వగా అందులో ఎనిమిది ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. 2020-2021 విద్యా సంవత్సరంలో 14 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి, 2021-2022లో 78 ప్రాజెక్టులు జిల్లాస్థాయికి సెలెక్ట్ అయ్యాయి.
ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగం..
ఇన్స్సైర్ మనక్ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు పారితోషికం వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. సెప్టెంబర్ 15వ తేదీ లోపు 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవాలి. సందేహాలుంచే 9440414250ను సంప్రదించాలి.
– సిద్దిరాంరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, కామారెడ్డి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

