పంచాయతీ నిధులు దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని రాస్తారోకో

బోధన్ రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం మండంలోని సాలూర గ్రామం వద్ద బోధన్ నుంచి నాందేడ్ వైపు వెళ్లే రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పంచాయతీకి చెందిన రెండు లక్షల 22 వేల రూపాయలను ట్రాన్స్ఫార్మర్ తరలించడానికి నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ చంద్రకళ కుటుంబ సభ్యులు, ఉప సర్పంచ్ డిస్కోసాయిలు, పంచాయతీ కార్యదర్శి రాజీవ్ గాంధీలపై విచారణ చేపట్టి తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. సర్పంచ్ తన సొంత స్థలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మరో చోటికి తరలించడానికి పంచాయతీ నిధులను అక్రమంగా వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
తీర్మానం కాపీపై ట్రాన్స్ఫార్మర్ తరలించే విషయం లేకున్నా వార్డు సభ్యులు సంతకాలు పెట్టిన అనంతరం ఖాళీ స్థలంలో తీర్మానం జరిగినట్లు రాసుకుని నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.రాస్తారోకో విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మోనేగారి రాజు, గంగాధర్, శ్రీరామ్, గంగాధర్, పోశెట్టి, శివకాంత్పటేల్, మట్టెన్ ప్రకాశ్, భాస్కర్, లక్ష్మణ్ తదితరులున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

