నిజామాబాద్‌కు రూ.226 కోట్లు
రుణమాఫీలో భాగంగా తొలివిడుత నిజామాబాద్ జిల్లాకు రూ.226కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడారు.
- రుణమాఫీ నిధులు విడుదల చేసినట్లు వీసీలో వెల్లడించిన సీఎం
బోధన్, జూలై 18: రుణమాఫీలో భాగంగా తొలివిడుత నిజామాబాద్ జిల్లాకు రూ.226కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడారు. బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులతో సీఎం రేవంత్ ముఖాముఖి మాట్లాడారు.
కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతీశరత్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సంకేత్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, బోధన్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రవీ..అంకాపూర్ చికెన్ తినిపిస్తావా..
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో రైతు మందర్న రవి మాట్లాడారు. రుణమాఫీ చేసిన మీకు రైతులంతా ఎంతో రుణపడి ఉంటారని సీఎంపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం ముసిముసి నవ్వులు నవ్వుతూ.. ‘రవీ ..రైతు రుణమాఫీ చేసినందుకు అంకాపూర్ చికెన్ తినిపిస్తావా..’ అని అడిగారు. అందుకు రవి ‘తప్పకుండా సార్.’ అంటూ సమాధానం ఇచ్చారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

