ప్రకృతి ఒడిలో.. ‘గట్టు కింది’ గ్రామాలు
ఈ గ్రామాలన్నీ అటవీ ప్రాంతంలో ఉండడంతో తండావాసులకు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంపై అవగాహన ఎక్కవగా ఉంటుంది. ఈ గ్రామాల మీదుగా ప్రయాణం చేసేవారికి ఎతైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం కనువిందు చేస్తుంది.
- అటవీ ప్రాంతంలో జీవనం
- వ్యవసాయమే జీవనాధారం
- ఏడాదికి రెండు పంటల సాగు
- ఎటుచూసినా ఆహ్లాదం పంచుతున్న పచ్చదనం
గాంధారి, మార్చి 13 : మండలంలో గట్టు కింద గండివేట్, సీతాయిపల్లి, మేడిపల్లి, గౌరారం, ముదెల్లి, వెంకటాపూర్, చెన్నాపూర్, నర్సపూర్, మొండిసడాక్, సర్వపూర్, గండివేట్ తండా, హేమ్లానాయక్ తండా, గౌరారం తండా, చందానాయక్ తండా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ అటవీ ప్రాంతంలో ఉండడంతో తండావాసులకు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంపై అవగాహన ఎక్కవగా ఉంటుంది. ఈ గ్రామాల మీదుగా ప్రయాణం చేసేవారికి ఎతైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం కనువిందు చేస్తుంది. మండలంలో గట్టు కింది గ్రామాలు అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వివిధ పనులపై ఆ గ్రామాలకు వెళ్తే.. గట్టు కిందికి వెళ్తున్నామని సమాధానం చెప్పడం గమనార్హం.
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా..
గట్టు కింది గ్రామాల్లో వారికి వ్యవసాయమే జీవనాధారం. మండలంలో ఎక్కడ లేని విధంగా గట్టు కింది గ్రామాల్లో ఏడాది పొడవునా పచ్చదనం సంతరించుకొని ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదం పంచుతుంది. ముఖ్యంగా చెరువులు, బోరు బావులు ఎక్కువగా ఉండడంతో ఎప్పుడు చూసినా పచ్చని పంటలు దర్శనమిస్తాయి. ఇక్కడి రైతులు ఏడాదికి రెండు పంటలను పండిస్తారు. వానకాలంలో వరి, యాసంగిలో మక్కజొన్నతోపాటు వరి పంటను సైతం సాగు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. మండలంలో ఎక్కడా లేనివిధంగా పంట దిగుబడి కూడా ఎక్కువగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత.
గ్రామాల ప్రత్యేకత..
గట్టు కింది గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. పీర్ల పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది గండివేట్. కులమతాలకు అతీతంగా నిర్వహించే కాశీందూల సవారీ. ఈ సవారీకి కామారెడ్డి జిల్లాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ముంబై వంటి దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. గౌరారం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలను ఎక్కడా లేని విధంగా 18 కులాల వారు కలిసి తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. వెంకటాపూర్ తండాలో సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. తండా సమీపంలోని సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రాగణంలో పెద్ద ఎత్తున జాతర సాగుతుంది. సీతాయిపల్లిలో హనుమాన్ జయంతి వేడుకలను గ్రామస్తులందరూ కలిసి ఘనంగా జరుపుకొంటారు. ముదెల్లి, మేడిపల్లి గ్రామాల్లో సైతం ఊరపండుగ, బతుకమ్మ వేడుకలు, బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తారు. గట్టు కింది గ్రామాలన్నీ దగ్గర దగ్గరగా ఉండడం, వ్యవసాయ భూములు కూడా పక్కపక్కనే ఉండడంతో అన్ని గ్రామాల ప్రజలు కలిసిమెలిసి ఉంటూ ఐక్యతను చాటుతున్నారు.
దట్టమైన గట్టును ఆనుకొని ఉన్నాం..
గండివేట్ గ్రామంతోపాటు, గట్టు కింద ఉన్న ప్రతి ఊరికి దట్టమైన గట్టు(అడవి) ఆనుకొని ఉంది. మా ఊరు దట్టమైన గండిలో ఉండడంతో గండివేట్ అనే పేరువచ్చింది. గట్టు కింది గ్రామాలన్నీ దగ్గర దగ్గరగా ఉండడంతో అందరం కలిసిమెలిసి ఉంటాం.
-కాపర్తీ రవి, గండివేట్ గ్రామం
పంటలు కనువిందు చేస్తాయి..
గట్టు కింది గ్రామాల్లో ఎప్పుడు చూసినా పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తాయి. మా ఊరిలో మక్కజొన్నతోపాటు వరి, చెరుకు, కూరగాయల పంటలను ఎక్కువగా పండిస్తాం. పండుగలను అందరం కలిసి ఘనంగా జరుపుకొంటాం.
-పిట్ల సురేశ్, మేడిపల్లి గ్రామం
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

