Home
Nizamabad
Basavanna Sacred Bull With Massive Horns Draws Attention Creates A Stir In Potangal Mandal
Potangal | భారీ కొమ్ములతో ఆకట్టుకుంటున్న బసవన్న.. పోతంగల్ మండలంలో సందడి
పోతంగల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో అందంగా అలంకరించిన ఓ బసవన్న ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణ ఎద్దులకు భిన్నంగా, అత్యంత భారీగా, వెడల్పుగా తిరిగి ఉన్న దీని కొమ్ములు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి.
Potangal | పోతంగల్, నవంబర్ 27 : పోతంగల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో అందంగా అలంకరించిన ఓ బసవన్న ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణ ఎద్దులకు భిన్నంగా, అత్యంత భారీగా, వెడల్పుగా తిరిగి ఉన్న దీని కొమ్ములు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ఆ పొడవాటి కొమ్ములకు అందమైన రంగులు అద్ది, చివర్లలో కుచ్చులు, ఇత్తడి తొడుగులు కట్టి వినూత్నంగా ముస్తాబు చేశారు. దీనికి తోడు ఒంటిపై ఎర్రటి పట్టు వస్త్రాలు, నుదుటిపై పూసల దండలు, మెడలో గజ్జెలతో రాజసంగా నడుస్తూ వస్తున్న ఈ బసవన్నను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. వీధుల వెంట తిరుగుతున్న ఈ బసవన్న వద్దకు చిన్నారులు, పెద్దలు చేరి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తూ బియ్యం, డబ్బులు కానుకలుగా సమర్పిస్తున్నారు. గజ్జెల సవ్వడితో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

