పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజ య్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండల కేంద్రం లో విలేకరులతో మాట్లాడారు. బాధితురాలైన మైనర్‌కు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
- భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి
- బాలిక కుటుంబాన్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి
- బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ డిమాండ్
డిచ్పల్లి, మే 11 : బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజ య్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండల కేంద్రం లో విలేకరులతో మాట్లాడారు. బాధితురాలైన మైనర్‌కు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. భగీరథ్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో విచారణ పేరుతో బాలికకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. బాధితురాలికి అండగా నిలువాల్సిన పోలీసులు, నిందితుడిని రక్షించేలా వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. బాధిత కుటుంబాన్ని బెదిరించిన ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బీఆర్ఎస్ నాయకులు పద్మారావు, దాసరి లక్ష్మీనర్సయ్య, సర్పంచులు యూసుబ్, యాదగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రుద్రంపూర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ అద్దాలు ధ్వంసం
AP SEC | పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు తావులేదు : ఏపీ ఎస్ఈసీ
‘కొత్తగూడెం ఇంటి పట్టాల పంపిణీ అవినీతిపై ఎమ్మెల్యే స్పందించాలి’
‘నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం’
NagaChaitanya | ‘వృషకర్మ’ ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్.. పెద్దపల్లి రామగిరి ఖిల్లాపై నాగచైతన్య సాహసయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

