రచ్చ.. రచ్చ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రొటోకాల్ వివాదం రచ్చరేపుతున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ లీడర్లకే ప్రభుత్వ యంత్రాంగం గౌరవ మర్యాదలు ఇస్తున్నది. ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా వ్యతిరేకత వస్తున్నది.
- ప్రభుత్వ కార్యాలయం
- ఉమ్మడి జిల్లాలో ప్రొటోకాల్ రగడ
- అధికార పార్టీకి యంత్రాంగం వత్తాసు
- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు
- కాంగ్రెస్ లీడర్లకే ప్రాధాన్యమిస్తున్న వైనం
- ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా నిర్లక్ష్యం
- శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదుల పరంపర
- కనీసం పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు
నిజామాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రొటోకాల్ వివాదం రచ్చరేపుతున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ లీడర్లకే ప్రభుత్వ యంత్రాంగం గౌరవ మర్యాదలు ఇస్తున్నది. ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా వ్యతిరేకత వస్తున్నది. సామాన్యుల పనులకు సవాలక్ష కొర్రీలు పెట్టే ప్రభుత్వాధికారులే ఇలా వక్రమార్గాన్ని పాటిస్తుండడంపై ప్రజలు తప్పుపడుతున్నారు. ప్రజల చేత ఎన్నికైన వారిని కాదని ఓటమి చెందిన రాజకీయ నాయకులకు ఊడిగం చేయడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేతలకు వంతపాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరైన విధానం కాదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఎమ్మెల్యేలు నిర్వర్తించాల్సిన విధులకు ఆటంకం కల్పిస్తూ వారిచ్చిన ఆదేశాలను పాటించకుండా ఇష్టారీతిన కొన్ని శాఖలకు చెందిన అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. ఈ వ్యవహారంపై ఉమ్మడి జిల్లాలో వాగ్వాదాలు, ఘర్షణలు జరుగగా ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో మరోమారు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. బాల్కొండలో మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా గెలిచిన వేముల ప్రశాంత్ రెడ్డిని కాదని కాంగ్రెస్ నాయకుడి చెప్పుచేతల్లో పలువురు అధికారులు పని చేస్తుండడం ఘోరంగా మారింది.
అధికారానికి సలాం..
ప్రభుత్వంలో భాగమైన కార్యనిర్వహక వ్యవస్థ రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవలు అందించాలి. వారికి అప్పగించిన విధులను తూచ తప్పకుండా పాటించాలి. కానీ అలాంటిదేమీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరగడం లేదు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా ఎమ్మెల్యేలకే గౌరవ మర్యాదలు ఇవ్వకుండా మొత్తం వ్యవస్థకే మాయని మచ్చగా పలువురు అధికారుల తీరు కనిపిస్తున్నది. బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఇప్పుడీ దుస్థితి ఘోరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు దక్కుతున్న ప్రాధాన్యత ఎమ్మెల్యేలకు కనీస మర్యాద కూడా ఇవ్వకపోవడంపై ప్రజల్లో చర్చ జరుగుతున్నది. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తులకు సాగిల పడుతున్న ప్రభుత్వ అధికారుల తీరును చూసి అంతా నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే కూడా ఎత్తకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సమీక్షలు, సమావేశాలకు యథేచ్ఛగా డుమ్మా కొట్టి సమాధానం ఇవ్వకపోవడం, ప్రజల అవసరాలను గుర్తించేందుకు ఎమ్మెల్యేలు ఆదేశిస్తే పట్టించుకోకపోవడం వంటిది యథాలాపంగా జరుగుతున్నది. దీంతో అధికార పార్టీ తీరును ఎదుర్కోలేక పలువురు మిన్నకుండాల్సి వస్తున్నది. కామారెడ్డిలో ఇలాంటి వ్యవహారంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. దవాఖాన అభివృద్ధి పనుల విషయంలో వైద్యాధికారులు వ్యవహరించిన తీరుపై కామారెడ్డి ఎమ్మెల్యే నిప్పులు కక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆర్మూర్ ఎమ్మెల్యే రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి ప్రొటోకాల్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
పట్టింపులేని ఉన్నతాధికారులు…
కండ్ల ముందే వ్యవస్థ వక్రమార్గంలో నడుస్తున్నప్పటికీ ఉభయ జిల్లాల్లో ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు కలెక్టర్, సీపీ, ఎస్పీలకు స్థానిక ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖలకు చెందిన అధికార యం త్రాంగం చేస్తున్న నిబంధనలకు విరుద్ధమై న పనులపైనా వారి దృష్టికి తీసుకెళ్లారు. కానీ మార్పు మాత్రం కనిపించడం లేదు. ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వని వారిపై చర్యలు తీసుకుంటే వారంతా దారిలోకి వచ్చేవారు. లేదంటే మరోసారి తప్పు చేసే వారు కాదు. మిగిలిన వారు కూడా ప్రొటోకాల్ విషయంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పడే వీలున్నది. చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే నిర్లక్ష్యంగా పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయి లో వేరే విధమైన ఆదేశాలు చెప్పకనే అమలవుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు మూడు చోట్ల బీజేపీ, రెండు చోట్ల బీఆర్ఎస్, నాలుగు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లోనే వ్యవస్థలు సక్రమంగా నడుస్తుండగా మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు విలువే లేకుండా పోతున్నది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఈ రకమైన తీరు మూలంగా ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

