సోమవారం 30 నవంబర్ 2020
Nirmal - Oct 29, 2020 , 01:31:27

అత్యాధునిక సదుపాయాలతో దవాఖాన అభినందనీయం

అత్యాధునిక సదుపాయాలతో దవాఖాన అభినందనీయం

  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • నిర్మల్‌లో దేవేందర్‌ రెడ్డి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం 

నిర్మల్‌ అర్బన్‌ : కార్పొరేట్‌ తరహాలో అత్యాధునిక సదుపాయాలతో జిల్లాలో దవాఖానలు ఏర్పాటు చేయడం అభినందనీయమని మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలోని శాస్త్రీనగర్‌ కాలనీలో దేవేందర్‌ రెడ్డి సూపర్‌స్పెషాలిటీ దవాఖానను బుధవారం ఆ యన ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో మహానగరాలకు వెళ్లకుండా అన్ని సదుపాయాలతో జిల్లాలోనే దవాఖాన ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నా రు. జిల్లా ఏర్పడక ముందు అత్యవసర సేవల కు నిజామాబాద్‌, హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చేదని పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు కార్పొరేట్‌ దవాఖానలు ఏర్పడడంతో రోగుల కు సత్వర వైద్య సేవలు అందుతున్నాయన్నా రు. మెరుగైన సేవలు అందించి, గుర్తింపు తె చ్చుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మంత్రి అల్లోల దంపతులను యాజమా న్యం సన్మానించింది. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ముథోల్‌ ఎమెల్యే విఠల్‌ రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్మద ముత్యం రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, అల్లోల గౌతం రెడ్డి, తి రుపతి రెడ్డి, మురళీధర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.