హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష హోదాను పొందిన పార్టీ?
హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష హోదాను పొందిన పార్టీ?
ఉద్యమ చరిత్ర-1
1. కింది వాక్యాలను పరిశీలించండి.
1) త్రిలింగ దేశానికి తెలంగాణ అని ఢిల్లీ సుల్తాన్లు నామకరణం చేశారు
2) తెలంగాణ అనే పదం స్పష్టంగా వెలిచర్ల శాసనంలో పేర్కొన్నారు
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ : తెలంగాణ పదానికి గల చారిత్రక నేపథ్యం –
- తెలంగాణ అనే పదం ‘టలింగాన్’ అనే పేరుతో మొదటిసారి టాలమీ రచించిన జాగ్రఫీ అనే గ్రంథంలో కనిపించింది. తెలంగాణ ప్రజల గురించి మార్కండేయ పురాణం, వాయు పురాణంలో ప్రస్తావించగా, ఇంద్ర వర్మ వేయించిన పూర్తి శిలా శాసనంలో తిల్లింగ అనే పేరుతో మొదటిసారి బయటపడింది. కాకతీయుల కాలం నాటికి ఈ తిల్లింగ త్రిలింగ దేశంగా మారింది. (త్రిలింగ దేశానికి తెలంగాణ అని ఢిల్లీ సుల్తాన్లు నామకరణం చేశారు. తెలంగాణ అనే పదాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కువగా వ్యవహరించాడు. ఈ పదం అసఫ్‌జాహీల కాలం నుంచి స్థిరపడింది. అరబ్బులు, పర్షియన్ చరిత్రకారులు తెలంగాణ తెలుగు ప్రాంతాన్ని లేదా తిలింగ్ అని పిలిచేవారు. తెలంగాణ అనే పదం స్పష్టంగా వెలిచర్ల శాసనంలో పేర్కొన్నారు.) కుతుబ్‌షాహీల కాలంలో తెలంగాణ ప్రాంతం గోల్కొండ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత అసఫ్‌జాహీల కాలంలో హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉంది. చౌదరి, వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు పరిపాలన కాలంలో తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉంది.
2. కింది వాక్యాలను పరిశీలించండి.
1) 1725లో నిజాం-ఉల్-ముల్క్ హైదరాబాద్‌లో అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించాడు.
2) 1948, సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమైన తరువాత 1948, సెప్టెంబర్ 18 నుంచి 1956 వరకు జె ఎన్ చౌదరి, వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ర్టాన్ని పరిపాలించారు
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : బి
వివరణ : 1724లో నిజాం-ఉల్-ముల్క్ హైదరాబాద్‌లో అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించాడు
మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను భారత సైన్యం ఆపరేషన్ పోలో ద్వారా ఓడించి, నిజాం రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేసింది. 1948, సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమైన తరువాత 1948, సెప్టెంబర్18 నుంచి 1956 వరకు జె.న్. చౌదరి, వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ర్టాన్ని పాలించారు. 1956, నవంబర్ 1న తెలంగాణ-ఆంధ్రప్రాంతాలు విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
3. కింది వాక్యాలను పరిశీలించండి.
1) భగేలాలు సాధారణంగా వ్యవసాయ బానిసలు
2) నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భగేలా పద్ధతి అమల్లో ఉండేది
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ: భగేలాలు సాధారణంగా వ్యవసాయ బానిసలు. భగేలా భూమిలేక నిస్సహాయుడై, పన్ను చెల్లించలేక దాసునిగా మారి బకాయికి ప్రత్యామ్నాయంగా వెట్టి చాకిరీ చేసేవాడు. అప్పులు తీర్చలేని భగేలా వివాహం చేసుకుంటే అతని భార్య కూడా చేయాల్సి వచ్చేది. (నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భగేలా పద్ధతి అమలులో ఉండేది.) ఈ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని నిజాం ప్రభుత్వం 1930లో భగేలా పన్ను నిర్మూలన కోసం తీర్మానించింది.
4. కింది వాటిని కాలక్రమానుసారం క్రమం చేయండి.
1) వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం
2) మహిళల గౌరవ మర్యాదలను కాపాడే చట్టం
3) బాల కార్మిక నిషేధ చట్టం
4) బాలకార్మికుల హక్కుల, కమిషన్ల చట్టం
5) జాతీయ బాలల హక్కుల చట్టం
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1-2-3-4-5 బి) 4-3-2-1-5
సి) 5-3-2-1-4 డి) 5-2-3-4-1
జవాబు : ఎ
- వివరణ: వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం – 1976
- మహిళల గౌరవ మర్యాదలను కాపాడే చట్టం – 1986
- బాల కార్మిక నిషేధ చట్టం – 1986
- బాల కార్మికుల హక్కుల, కమిషన్ల చట్టం – 2005
- జాతీయ బాలల హక్కుల చట్టం – 2006
5. కింది వాక్యాలను పరిశీలించండి
1. 1857లో నాసిరుద్దౌలా మరణానంతరం 5వ నిజాంగా అఫ్జలుద్దౌలా రాజ్యానికి వచ్చాడు
2. అఫ్జలుద్దౌలా కాలంలో (Cuthbert Davidson) కుత్బర్ట్ డేవిడ్సన్, రిచర్డ్ టెంపుల్ హైదరాబాద్ రెసిడెంట్‌గా పనిచేశారు
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ: 1857లో నాసిరుద్దౌలా మరణానంతరం 5వ నిజాంగా అఫ్జలుద్దౌలా రాజ్యానికి వచ్చాడు. హైదరాబాద్ రాజ్యాన్ని అతి తక్కువ కాలం (12 ఏళ్లు) పాలించిన నిజాం. అఫ్జలుద్దాలా కాలంలో కుత్బర్ట్ డేవిడ్సన్, రిచర్డ్ టెంపుల్ హైదరాబాద్ రెసిడెంట్‌గా పనిచేశారు. ఇతని కాలంలోనే బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి జరిగింది.
6. కింది వాక్యాలను పరిశీలించండి.
1) మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో స్థాపించిన స్కూల్స్ – సిటీ హైస్కూల్, ఇంజినీరింగ్ కాలేజీ – 1870
2) మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో స్థాపించిన స్కూల్స్ – బిల్గామి బాలికల పాఠశాల – 1878
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ: మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలోస్థాపించిన స్కూల్స్ – కాలేజీలు
- సిటీ హైస్కూల్, ఇంజినీరింగ్ కాలేజీ -1870
- ముల్లా అబ్దుల్ ఖయ్యూం సెంట్రల్ లైబ్రరీ (అసఫియా లైబ్రరీ) – 1872
- చాదర్ ఘాట్ హైస్కూల్ 1872
- మదర్సా-ఇ-ఆలియా – 1873
- బిల్గామి బాలికల పాఠశాల – 1878
7. కింది వాక్యాలను పరిశీలించండి.
1) జోగినీ స్త్రీకి పసుపు పూసి వేపమండలతో తయారుచేసిన చీరకట్టే పద్ధతిని పుటం అంటారు.
2) బ్రహ్మీ, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణీ, చాముండి అనే ఏడు మంది స్త్రీ దేవతలను సప్త మాతృకలుగా చెబుతారు
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ కావు
జవాబు : సి
వివరణ : జోగిని స్త్రీకి పసుపు పూసి వేపమండలతో తయారు చేసిన చీరకట్టే పద్ధతిని పుటం అంటారు. బ్రహ్మీ, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణీ, చాముండి అనే ఏడు మంది స్త్రీ దేవతలను సప్త మాతృకలుగా చెబుతారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ గ్రామదేవతలు వీరి స్వరూపాలే. పోతరాజు ఈ దేవతలకు తమ్ముడు లేదా సేవకుడు
8. ముల్కీ ఉద్యమ పితామహుడు అని ఎవరిని అంటారు?
1) మొదటి సాలార్జంగ్
2) మహరాజ కిషన్ పెర్షాద్
3) మూడో సాలార్జంగ్
4) నాలుగో సాలార్ జంగ్
జవాబు : 2
వివరణ : మహరాజ కిషన్ పెర్షాద్
- 1907లో మహరాజ సర్ కిషన్ పెర్షాద్ లాల్ దర్వాజ మాతేశ్వర దేవాలయంలో బోనాల పండుగను మొదలు పెట్టాడు. ఇతను ముల్కీల హక్కుల కోసం పోరాడాడు. (అందువల్ల ఇతన్ని ముల్కీ ఉద్యమ పితామహుడు అంటారు)
9. 1919లో ముల్కీ ఫర్మానా మీర్ ఉస్మాన్ అలీఖాన్ జారీ ప్రకారం కింది వాక్యాలను పరిశీలించండి.
1) నాన్ ముల్కీ ఉద్యోగాలు తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
2) విద్యార్హత ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ : 1910లో ముల్కీ ఫర్మానా మీర్ మహబూబ్ అలీఖాన్ జారీ చేశాడు.
ఈ ఫర్మానాలోని అంశాలు –
1) నాన్ ముల్కీ ఉద్యోగాలు తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రాత పరీక్షలు నిర్వహించబడుతాయి.
2) మెరిట్ ద్వారా మాత్రమే ఎంపిక జరుగుతుంది.
3) ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదు
4) విద్యార్హత ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. స్థానికులకు తగినన్ని అర్హతలు ఉన్నప్పుడు ఆ పదవుల్లో వారినే నియమించాలి. స్థానికేతరులను నియమించరాదు.
10. కింది వాక్యాలను పరిశీలించండి.
1) హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ – వి.డి. దేశ్‌పాండే
2) హైదరాబాద్ డిప్యూటీ స్పీకర్ – పంపన గౌడ సక్రిప్ప (స్వతంత్ర అభ్యర్థి)
3) హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష హోదాను పొందిన పార్టీ – పి.డి.ఎఫ్
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1, 2 సరైనది బి) 1, 3 సరైనది
సి) 2, 3 సరైనవి డి) పైవేవీ సరైనవి
జవాబు : సి
వివరణ : హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ – కాశీనాథరావు వైద్య
- హైదరాబాద్ డిప్యూటీ స్పీకర్ – పంపన గౌడ సక్రిప్ప (స్వతంత్ర అభ్యర్థి)
- హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష హోదాను పొందిన పార్టీ – పి.డి.ఎఫ్
- ప్రతిపక్ష నాయకుడు – వి.డి. దేశ్‌పాండే (మరాఠ్వాడ ప్రాంతానికి చెందినవాడు)
11. కింది వాక్యాలను పరిశీలించండి.
1) 1950 జనవరి 26న ఆమోదించిన భారత రాజ్యాంగంలోని రాష్ర్టాల ‘బి’ కేటగిరీ జాబితాలో హైదరాబాద్ రాష్ర్టాన్ని చేర్చారు.
2) వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952 మార్చి 10న ఎన్నికల ద్వారా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడే వరకు కొనసాగారు
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు :ఎ
వివరణ : 1950లో హైదరాబాద్ రాజ్యంగ హోదా : 1950, జనవరి 26న ఆమోదించిన భారత రాజ్యాంగంలో హైదరాబాద్‌ను ‘బి’ కేటగిరీ రాష్ర్టాల్లో చేర్చారు. అదే రోజు చివరి మీర్ ఉస్మాన్ అలీఖాన్ తర్వాత ముఖ్యమంత్రిగా వెల్లోడి బాధ్యతలు చేపట్టారు.
- మిలిటరీ ఆపరేషన్, ఇంటిగ్రేషన్ : భారత ప్రభుత్వం 1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యను నిర్వహించింది.
- నిజాం మంత్రివర్గం రాజీనామా చేయడంతో ఈ ఆపరేషన్ హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకుంది.
- కొనసాగుతున్న ప్రాముఖ్యత, యు.ఎన్ జోక్యం: సైనిక చర్య జరిగినప్పటికీ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిజాం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కారణంగా పాక్షికంగా 1950, జనవరి 26 వరకు హైదరాబాద్ రాజ్ ప్రముఖ్‌గా ఉంది.
- నాయకత్వ పరివర్తన – 1952, మార్చి 6న ఎన్నికల ద్వారా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడే వరకు వెల్లోడి ముఖ్యమంత్రిగా పని చేశారు.
- ప్రాదేశిక విభాగం – 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి భారతదేశ భూభాగం నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ కథనం హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడం, ఆ ప్రాంతంలోని తదుపరి రాజకీయ పరిణామాలను చుట్టుముట్టే సంఘటనల క్రమాన్ని వివరిస్తుంది.
12. కింది వాక్యాలను పరిశీలించండి.
1) ఆసామి షక్మీదారుడు 12 ఏళ్లు వరుసగా ఒక భూమిని కౌలుకు తీసుకుంటే అతడు షక్మీదారుడుగా మారుతాడు.
2) 1989లో కౌలు విధానాలపై నియమించిన కమిటీ ఎం.ఎస్ భరూచా కమిటీ
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ : భూసంస్కరణలు
- నిజాం సంస్థానంలో కింది కౌలు చెల్లింపు పద్ధతులుండేవి
- పండిన పంటలో కొంత భాగాన్ని కౌలు శిస్తుగా చెల్లించే విధానం. ఈ విధానంలో కౌలు చెల్లించే విధానం స్థిరంగా ఉండేవి. నగదు రూపంలో కూడా కౌలును చెల్లించేవారు.
- కౌలుదారులు ప్రధానంగా రెండు రకాలుగా ఉండేవారు.
- షక్మీదారులు ఈ విధానంలో భూస్వాములు కౌలుదారులను శాశ్వతంగా నియమించేవారు. అందువల్ల వీరిని రక్షిత కౌలుదారులు అని కూడా అంటారు. వీరు చాలా తక్కువగా ఉండేవారు.
- ఆసామి షక్మీదారులు భూస్వాములు తాత్కాలికంగా నియమించే కౌలుదారులను ఆసామి షక్మీదారులు అంటారు. వీరికి భూమిపై ఎలాంటి హక్కులు ఉండవు. ఆసామి షక్మీదారుడు 12 ఏళ్లు వరుసగా ఒక భూమిని కౌలుకు తీసుకుంటే అతడు షక్మీదారుడుగా మారుతాడు. 1989లో కౌలు విధానాలపై నియమించిన కమిటీ -ఎం.ఎస్. భరూచా కమిటీ.
– దొమ్మటి తిరుపతి
ఫ్యాకల్టీ, ఎస్ జే ట్యుటోరియల్స్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

