జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం ఎంత?
ఆధునిక యుగంలో విద్యుచ్ఛక్తి ఆర్థికాభివృద్ధి అతి కీలకమైన అవస్థాపన సౌకర్యం. విద్యుత్ లేనిదే పరిశ్రమలు నడువవు. వ్యవసాయ రంగంలో నీటి పారుదల కష్టమవుతుంది. రవాణా, సమాచార, ఉత్పత్తి, వాణిజ్య అవసరాలకే కాకుండా గృహ అవసరాలకు కూడా విద్యుత్ తప్పనిసరి. రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి 1920 సంవత్సరంలో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ కేంద్రంగా 10 యూనిట్లతో ప్రారంభించి మూడో ప్రణాళిక ఆఖరుకు సుమారు 50,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. రాజ్యాంగం ప్రకారం విద్యుత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా కిందకు వస్తుంది. రాష్ర్టాల్లో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ నిర్వహణ కోసం రాష్ట్ర విద్యుత్ మండళ్లు ఏర్పడ్డాయి.
తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ముఖ్యంగా వ్యవసాయరంగంపై ఆధారపడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ వాడకం అవసరం ఉంది. 2013-14 సంవత్సరంలో వ్యవసాయ తలసరి వినియోగం 245 kwh. 2014లో తెలంగాణ రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్కో పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి విషయంలో ‘జలవిద్యుత్ ఉత్పత్తి కంటే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి’ అధికంగా ఉంది. 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హితేన్భయ్యా కమిటీ రాష్ట్ర విద్యుత్ మండలిని ఉత్పాదక, సరఫరా, పంపిణీ ప్రాతిపదికన మూడు వేర్వేరు సంస్థలుగా ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
తెలంగాణ విద్యుచ్ఛక్తి
- 1 ఫిబ్రవరి 2020 నాటికి తెలంగాణ మొత్తం వ్యవస్థాపిత సామర్థ్యం- కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ సంస్థలు కలిపి 15,261 మెగావాట్లు.
- ఇందులో థర్మల్ విద్యుత్ వాటానే అధికం.
- దేశంలో అత్యధిక విద్యుచ్ఛక్తిని వినియోగిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది.
- 2019-20 జాతీయ సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,208 కిలోవాట్స్ కాగా తలసరి విద్యుత్ వినియోగం 2,071 కిలోవాట్స్.
విద్యుత్ సంస్థలు
తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్
లిమిటెడ్ (టీఎస్ జెన్కో)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు 1959లో ఏర్పడింది.
- రాష్ట్ర విభజన ఫలితంగా ఏపీ జెన్కో నుంచి విడిపోయి టీఎస్ జెన్కోగా ఏర్పడింది.
- టీఎస్ జెన్కో ఏర్పడిన సంవత్సరం 2 జూన్ 2014.
- టీఎస్ జెన్కో ఉత్పత్తి చేస్తున్న జల విద్యుత్ మొత్తం- 3,382.50 మెగావాట్స్.
- టీఎస్ జెన్కో ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్ మొత్తం- 1 మెగావాట్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్
- ఈ కంపెనీ 2 జూన్ 2014న ఏర్పడింది.
- దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉంది.
- వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటు ధరల్లో అందించడం దీని ప్రధాన ఉద్దేశం.
జల విద్యుత్ కేంద్రాలు
నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం
- గోదావరి ఉపనది అయిన మంజీరా నదీ జలాలను జలవిద్యుచ్ఛక్తి కోసం వినియోగించడానికి జరుగుతున్న కృషిలో ఇది తొలి మెట్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా 35 మెగావాట్ల స్థాపక సామర్థ్యం కలిగిన నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఈ విద్యుత్‌ను హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు సరఫరా చేస్తున్నారు. దీని ఉత్పాదక శక్తి 10 మెగావాట్లు.
శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రం
దీనిని 1964లో ప్రారంభించారు. ఇది భూమి లోపల ఉన్న ఏకైక జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం. దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 900 మె.వా. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టు ఇదే.
నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం
- నాగార్జున సాగర్ డ్యామ్‌కు 1955, డిసెంబర్లో నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేయగా..1967లో జాతికి అంకితం చేశారు. హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టును 1978-85 మధ్య నిర్మాణం పూర్తి చేశారు. మొట్టమొదటిసారిగా ‘రివర్సబుల్ టర్బైన్’లను వినియోగించిన జల విద్యుత్ కేంద్రం ఇదే.
పోచంపాడు జలవిద్యుత్ కేంద్రం
- ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపైన నిర్మించారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 36 మె.వా సింగూర్ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం
- సంగారెడ్డి జిల్లా మంజీరా నదిపై నిర్మించిన సింగూరు రిజర్వాయర్‌పై దీనిని 1999లో ఏర్పాటు చేశారు. దీని ఉత్పత్తి సామర్థ్యం 15 మె.వా.
థర్మల్ విద్యుత్ కేంద్రాలు
జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) రామగుండం
- పెద్దపల్లి జిల్లా రామగుండంలో నవంబర్ 1983లో ఏర్పాటు చేశారు. ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. దీని సామర్థ్యం 2600 మె.వా. దక్షిణ భారతదేశంలో NTPC అతిపెద్ద థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ. దేశం మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి వాటా 27%. ఇది ఒక మహారత్న కంపెనీ.
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ దగ్గర స్థాపించారు.
- మొదటి యూనిట్ 1966, రెండవ యూనిట్ 1967, మూడవ యూనిట్ 1977లో ప్రారంభమయ్యాయి.
ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు గనుల ద్వారా బొగ్గు, కిన్నెరసాని రిజర్వాయర్ ద్వారా నీరు అందుతుంది.
హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్
- ఇది రాష్ట్రంలో మొదటి థర్మల్ పవర్ స్టేషన్.
- హైదరాబాద్ రాష్ట్రంలో 1920లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు.
- హుస్సేన్‌సాగర్ ఒడ్డున మింట్ కాంపౌండ్‌లో దీనిని ప్రారంభించారు.
స్థాపిత సామర్థ్యం 22.5 మెగావాట్స్. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.
1922లో దీనిని మూసివేశారు. 1995లో పూర్తిగా ధ్వంసం చేశారు.
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న నూతన థర్మల్ ప్రాజెక్టులు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్
- దామరచర్ల మండలం వీర్లపాలెం (నల్లగొండ)
- 4,400 మెగావాట్స్.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్
- మణుగూరు మండలం రామానుజవరం (భద్రాద్రి కొత్తగూడెం)
- 1,080 మెగావాట్స్.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్
- జైపూర్ మండలం పెగడపల్లి (ఆదిలాబాద్)
- 1,800 మెగావాట్స్.
సౌరవిద్యుత్
- ఇది సాంప్రదాయేతర రకానికి చెందిన కాలుష్య కారకం కాని శక్తి వనరు.
- ఈ రకమైన శక్తికి సూర్యుడు ప్రధాన మూలం.
- తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా జూరాల దగ్గర రేవులపల్లిలో స్థాపిత సామర్థ్యం 1 మెగావాట్తో సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
- ఇది టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్నారు.
జీవ ఇంధనం
- వ్యవసాయ, చెరకు వ్యర్థాలు, ఇతర వ్యవసాయ ఉప ఉత్పన్నాలు జీవ ఇంధనాలుగా వాడుతున్నారు.
- అరకిలో బరువు ఉన్న ఎండు మొక్క నుంచి 1890 కిలో క్యాలరీల ఉష్ణాన్ని ఉత్పత్తి చేయవచ్చు.
- ఒక సాధారణ జీవ ఇంధన కారక పదార్థం 68 శాతం మీథేన్, 31 శాతం కార్బన్ డై ఆక్సైడ్, 1 శాతం నత్రజని కలిగి ఉంటుంది. ఈ రకమైన ఉత్పత్తి తెలంగాణలో ఇంకా చేపట్టలేదు.
పవన శక్తి
- నౌకాయానానికి, నౌకల రవాణాకు ఉపయోగించిన మొట్టమొదటి శక్తి పవనశక్తితో విద్యుత్‌ను అతి తక్కువ ధరల్లోనే ఉత్పత్తి చేయవచ్చు.
- ప్రస్తుతం జర్మనీ, అమెరికా, డెన్మార్క్, స్పెయిన్, భారత్ ప్రపంచ పవన విద్యుత్ మొత్తం సామర్థ్యంలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
బయోగ్యాస్
- బయోగ్యాస్ అనేది మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ నీటి ఆవిరి వంటి వాయువుల మిశ్రమం. దీనిని తయారు చేసేందుకు మొక్కలు, జంతువుల వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, కొన్ని రకాల పరిశ్రమల్లో లభించే వ్యర్థాలు ఉపయోగిస్తారు. ఇది గ్రామీణ స్థాయిలో స్వల్పస్థాయిలో వినియోగంలో ఉంది.
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ కొరత ఎంత ఉంది?
1) 2700 మెగావాట్లు
2) 2500 మెగావాట్లు
3) 2400 మెగావాట్లు
4) 2100 మెగావాట్లు
2. ఒక శక్తివనరు అనేది కింది వాటిలో వేటికి తోడ్పడుతుంది?
1) ఉష్ణాన్ని జనింపచేసేందుకు
2) జీవిని శక్తివంతం చేసేందుకు
3) విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసేందుకు
4) పైవన్నీ
3. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంధన వనరుల్లో అధిక భాగం ఏ ఇంధనాలు ఉన్నాయి?
1) శిలాజ ఇంధనాలు
2) జీవ ఇంధనం 3) బయోగ్యాస్
4) జల విద్యుచ్ఛక్తి
4. కింది వాటిలో పునరుత్పాదన సాధ్యమయ్యే ఇంధన వనరు ఏది?
1) సౌరశక్తి 2) పవన శక్తి
3) తరంగ శక్తి 4) సౌరశక్తి
5. నీటిని సహజ, కృత్రిమ పద్ధతి ద్వారా వాలు మార్గంలో ప్రవహింజేసి టర్బైన్లు తిప్పడం ద్వారా ఉత్పత్తి అయిన శక్తిని ఏమంటారు?
1) పవన శక్తి 2) జలవిద్యుత్ శక్తి
3) తరంగ శక్తి 4) సౌరశక్తి
6. 2019-20 సంవత్సరం నాటికి దేశ తలసరి విద్యుత్ వినియోగం ఎంత?
1) 2.071 కిలోవాట్లు
2) 2,500 కిలోవాట్లు
3) 1,208 కిలోవాట్లు
4) 2,208 కిలోవాట్లు
7. 2020 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఎంత మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు?
1) 1.5 కోట్ల మంది
2) 1.2 కోట్ల మంది
3) 1.6 కోట్ల మంది
4) 1.4 కోట్ల మంది
8. తెలంగాణలో సూక్ష్మ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1) పాలేరు 2) పెద్దపల్లి
3) పోచంపాడు 4) 1, 2
9. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వల్ల ప్రయోజనం ఏమిటి?
1) జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల జీవితకాలం ఎక్కువ
2) పని, నిర్వహణ ఖర్చులు తక్కువ
3) నదిలో నీరు ఉన్నంత వరకు శక్తి
ఉత్పత్తికి అంతరాయం ఉండదు
4) పైవన్నీ
10. సాంప్రదాయేతర రకానికి చెందిన కాలుష్య కారకం కాని శక్తి వనరు ఏది?
1) సౌరశక్తి 2) బయోగ్యాస్
3) థర్మల్ విద్యుత్ 4) తరంగ శక్తి
11. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విద్యుత్ ఉత్పత్తి ప్రాథమిక స్థాయిలో ఉంది?
1) జల విద్యుత్ 2) సౌర విద్యుత్
3) థర్మల్ విద్యుత్ 4) బయోగ్యాస్
12. తెలంగాణలో టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో సౌరవిద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్న జూరాల విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
1) కుమ్రం భీం ఆసిఫాబాద్
2) జోగులాంబ గద్వాల
3) మేడ్చల్ మల్కాజిగిరి
4) రాజన్న సిరిసిల్ల
13. జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం ఎంత?
1) 1 మె.వా 2) 2 మె.వా
3) 3 మె.వా 4) 4 మె.వా
14. 2013-14 సంవత్సరంలో జూరాల విద్యుత్ కేంద్రం ఎన్ని యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది?
1) 1.5 మి. యూనిట్లు
2) 1.7 మి. యూనిట్లు
3) 1.8 మి. యూనిట్లు
4) 2 మి. యూనిట్లు
15. జీవ ఇంధన శక్తిని నిల్వ చేసిన ఏ శక్తికి రూపంగా చూడవచ్చు?
1) సౌరశక్తి 2) పవనశక్తి
3) జలవిద్యుత్ శక్తి 4) తరంగ శక్తి
Answers
1-1, 2-4, 3-1, 4-4, 5-2, 6-3, 7-3, 8-4 9-4 10-1
11-2, 12-2, 13-1 14-3, 15-1.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

