హైదరాబాద్ : RRB, SSC తో పాటు బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తున్నట్టు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ గురువారం ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 15 నుంచి మే 15వ తేదీ వరకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నారు. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల జిల్లా కేంద్రాల్లోని ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ కేంద్రంలో 100 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం http://www.tsstudycircle.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు. లేదా 040-23546552 నంబర్‌కు కాల్ చేయొచ్చు.