హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీఈసెట్)కు సంబంధించి రెండో, తుది విడత కౌన్సెలింగ్‌ను రేపటి (బుధవారం) నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్ పీఈసెట్ కన్వీనర్, ప్రొఫెసర్ రమేశ్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
అభ్యర్థులు 5, 6 తేదీల్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. 7న అర్హుల జాబితా వెల్లడిస్తారు. 8 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 11న ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితా ప్రకటిస్తారు. 12 నుంచి 17 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతుందని కన్వీనర్ వివరించారు.