ITI Admissions | ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలు.. 21తో ముగియనున్న దరఖాస్తులు
ఐటీఐ విద్యనభ్యసించే వారికి టీజీఎస్ఆర్టీసీ (ITI Admissions) ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్‌లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లలో ప్రవేశాలు జరుగుతున్నాయని, ఈ కోర్సులలో ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: ఐటీఐ విద్యనభ్యసించే వారికి టీజీఎస్ఆర్టీసీ (ITI Admissions) ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్‌లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లలో ప్రవేశాలు జరుగుతున్నాయని, ఈ కోర్సులలో ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తుంది.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ నెల 21వ తేదీలోపు iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ ఒక మంచి అవకాశమని సంస్థ పేర్కొన్నది. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ఐటీఐ కళాశాలలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌లోని హాకీంపేట, వరంగల్ ములుగు రోడ్‌లోని ఐటీఐ కళాశాలలను నేరుగా సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఇప్పటికే ఇదే విషయమై సంస్థ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.
త్వరలో 3వేల పోస్టుల భర్తీ..
ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో పోస్టుల భర్తీకి కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీలో 3 వేల 38 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబడింది. 3,038 భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ వేసి త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి ఆయన సూచించిన.
మొత్తం 3,038 ఉద్యోగాల్లో 2,000 డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. 743 శ్రామిక్ పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) పోస్టులు, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) పోస్టులు, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్ , 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ చేస్తారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

