హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): టెట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థుల కోసం పాత హాల్‌టికెట్ నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. తాజాగా టెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో 2011 నుంచి 2017 వరకు నిర్వహించిన 6 టెట్ పరీక్షల హాల్‌టికెట్ నంబర్లను వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రస్తుత టెట్ దరఖాస్తుల్లో పాత టెట్ హాల్‌టికెట్ నంబర్లను అడుగుతున్నారు. ఆ నంబర్లు లేక అభ్యర్థులు పడుతున్న ఇబ్బందిని గుర్తించి, టీఎస్‌టెట్ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌కు)కు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నాటికి 12వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.