UGC NET | రేపటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు.. అడ్మిట్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు.
న్యూఢిల్లీ: జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 83 సబ్జెక్టులకు రెండు సెషన్లలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) ఉంటుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను (Admit Card ) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్ష రోజు ఉదయం వరకు ఎన్టీఏ వెబ్‌సైట్‌తోపాటు https://ugcnet.nta.nic.in/ వెబ్సైట్ ద్వారా కూడా తమ హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
కంప్యూటర్ ఆధారితంగా (CBT) నిర్వహించే పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి పేపర్‌ను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో మొత్తం 150 చొప్పున ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ఇందులో ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. అంటే సమాధానాలు తప్పుగా గుర్తించినప్పటికీ మార్కులు కోతవిధించరు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

