హైదరాబాద్ : నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ( BPT ) కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2021 విద్యాసంవత్సరానికి గానూ 50 సీట్లను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు www.nims.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. సెప్టెంబర్ 18వ తేదీ లోగా దరఖాస్తులను సమర్పించాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అనంతరం హార్డ్ కాపీని సెప్టెంబర్ 21వ తేదీ లోగా పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపాలని సూచించారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :
Associate Dean, Academic-2, second floor,
old OPD block, NIMS, Punjagutta, Hyderabad-500082