పాలిసెట్ ఫలితాలు విడుదల..
TS Polycet | టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది,
హైదరాబాద్: టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది, ఎంబైపీసీ విభాగంలో 75.81 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in, https://polycetts.nic.in, www.sbtet.telangana.gov.in వెబ్సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు. కాగా, పాలిటెక్ ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తామని నవీన్ మిట్టల్ ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జూన్ 30న పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 1,04,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 75.73 శాతం మంది అంటే 79,038 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలురు 40,669 మంది అంటే 72.12 శాతం, బాలికలు 38,369 మంది అంటే 79.99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
నేడు పాలిసెట్ నోటిఫికేషన్
పాలిసెట్ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని నవీన్ మిట్టల్ ప్రకటించారు. జులై 18 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభవుతాయని, ఆగస్టు 15 వరకు అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టికల్చర్ వర్సిటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయన్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

