JEE Main.. ఫస్ట్ సెషన్ జూన్‌లో, రెండో సెషన్ జూలైలో
JEE Main | దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్ష షెడ్యూల్ మారింది. మొదటి సెషన్ జూన్‌కి, రెండో సెషన్ జూలైకి వాయిదా పడింది.
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్ష షెడ్యూల్ మారింది. మొదటి సెషన్ జూన్‌కి, రెండో సెషన్ జూలైకి వాయిదా పడింది. గత షెడ్యూల్ ప్రకారం సెషన్ 1 ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా, దీన్ని జూన్ 20–29వ తేదీ మధ్య.. అదే విధంగా సెషన్ 2 పరీక్షను మే 24–29 మధ్య నిర్వహించాల్సి ఉండగా ఇప్పుడు జూలై 21–30వ తేదీల మధ్య నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో మార్పులు ఎంసెట్ పరీక్షపై ప్రభావాన్ని చూపనున్నాయి.
జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసిపోయింది. రెండో విడుతకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో రానుంది. ప్రస్తుతం మొదటి సెషన్ అప్లికేషన్స్‌కు సంబంధించిన సవరణ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది శుక్రవారం ముగియనుంది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

