ఇండోర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో సంయుక్తంగా నిర్వహిస్తున్న కోర్సులో ప్రవేశ ప్రకటన విడుదలైంది.
కోర్సు: మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) ఇన్ డాటా సైన్స్ అండ్ మేనేజ్మెంట్
అర్హతలు: ప్రథమశ్రేణిలో బీటెక్/బీఈ లేదా బీఎస్/బీఫార్మా, బీఆర్క్, బీడిజైన్, లేదా బీఎస్సీ, ఎమ్మెస్సీ/ఎంసీఏ, ఎంబీఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు. వీటితోపాటు క్యాట్/గేట్ లేదా జీమ్యాట్/జీఆర్ఈ/జామ్ వంటి పరీక్షల్లో వ్యాలిడ్ స్కోర్ సాధించి ఉండాలి. గత మూడేండ్లలో సాధించిన వారు కూడా అర్హులే.
నోట్: పైన చెప్పిన ఏ కోర్సులోనైనా కనీసం రెండు మ్యాథ్స్ కోర్సులు, ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ డిగ్రీస్థాయిలో చదివి ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: జనవరి 7
వెబ్సైట్: htttp://msdsm.iiti.ac.in