మహిళల కోసం ‘గూగుల్ జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్’ ప్రకటన విడుదలైంది.
అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏదైనా ఆసియా పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ తత్సమాన కోర్సులు చదువుతున్నవారు.
దీంతోపాటు పాఠశాల స్థాయి నుంచి మంచి అకడమిక్ రికార్డ్ తప్పనిసరి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. కంప్యూటర్లపై ప్రాథమిక అవగాహన కూడా లేనివారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందుకోవడంలో ఆసక్తి ఉండాలి. టెక్నికల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన నైపుణ్యాలు ఉండాలి.
స్కాలర్షిప్: ఎంపికైన వారికి 2022-23 ఏడాదిలో 1000 డాలర్ల స్కాలర్షిప్ను గూగుల్ ఇస్తుంది.
ఎంపిక: దరఖాస్తులను పరిశీలించి అకడమిక్ ప్రతిభ, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం తదితరాల అంశాల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 10
వెబ్సైట్: https://buildyourfuture.withgoogle.com