వాతావరణ స్థితిగతులు.. భౌతిక పరిస్థితులు
ఏప్రిల్, మే నెలలో సూర్యుడు కర్కటరేఖ వైపు పయనించడం వల్ల టిబెట్ భూభాగంలో ఉష్ణోగ్రతలు పెరిగి దేశ వాయవ్య ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది.
భారతదేశం – శీతోష్ణస్థితి
- భూమి చుట్టూ దట్టంగా ఆవరించిన గాలిపొరను వాతావరణం అంటారు.
- ఒక చిన్నప్రాంతంలో ఒక రోజులో లేదా రెండు, మూడు రోజుల్లో వాతావరణంలో వచ్చే మార్పును ఆ ప్రదేశ వాతావరణ స్థితి అంటారు.
- ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు (కనీసం 30 ఏళ్లు) ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను ‘శీతోష్ణస్థితి (Climate) అంటారు. వాతావరణ స్థితుల సరాసరిని ఆ ప్రదేశపు శీతోష్ణస్థితి అంటారు.
శీతోష్ణస్థితి
- శీతోష్ణస్థితిని ఆంగ్లంలో ైక్లెమేట్ అంటారు. ఈ పదం ైక్లెమా (Clima) అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ైక్లెమా అంటే ‘సూర్యకిరణాలు వంగడం’ (Inclination of Sun’s rays) అని అర్థం.
- ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించి కొన్ని సంవత్సరాల సగటు ఉష్ణోగ్రత, వాయుపీడనం, పవనాలు, వర్షపాతం, ఆర్థ్రత, అవపాతం మొదలైన భౌతిక అంశాల పరిస్థితులను శీతోష్ణస్థితి అంశాలు అంటారు.
- శీతోష్ణస్థితిని విశదీకరించే శాస్ర్తాన్ని ‘ైక్లెమటాలజీ (Climatology) అంటారు. ఒక సంవత్సరానికి మరొక సంవత్సరానికి వాతావరణంలో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నా శీతోష్ణస్థితిలో మార్పులు దీర్ఘకాలంలోనే సంభవిస్తాయి.
శీతోష్ణస్థితి – ైక్లెమోగ్రాఫ్లు : దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతాల్లోని తేడాలను ైక్లెమోగ్రాఫ్ల ద్వారా తెలుసుకుంటారు.
ఉష్ణమండల రుతుపవన..
- భారత శీతోష్ణస్థితి ఎంతో వైవిధ్యభరితమైంది. ప్రతి రెండు నెలలకొకసారి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి.
- దేశంలో వాతావరణ పరిస్థితులు ఒక్కోప్రాంతంలో ఒక్కోలా, ఒక్కో సమయంలో ఒక్కో రకంగా ఉంటాయి.
- దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడే రుతుపవన ప్రక్రియ దేశ శీతోష్ణస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
- భారత దేశ శీతోష్ణస్థితిని స్థూలంగా ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితిగా పేర్కొనవచ్చు. భారతదేశ భూభాగంలో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్ల సంభవిస్తుంది. కాబట్టి మనదేశ శీతోష్ణస్థితిని “రుతుపవన రకపు శీతోష్ణస్థితి” అంటారు.
- భారతదేశం మీదుగా కర్కటరేఖ(23 1/2 డిగ్రీలు ఉత్తర అక్షాంశం) ప్రయాణిస్తూ ఉన్నందువల్ల కర్కటరేఖకు పై భాగంలో ఉన్న అర్ధభాగంలో ఉప అయన రేఖ శీతోష్ణస్థితి, దక్షిణ అర్ధభాగంలో అయనరేఖ శీతోష్ణస్థితి ఉంటాయి.
మాన్సూన్ లేదా రుతువు : మాన్సూన్ అనేది ‘మౌనస్’ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. - దీని అర్థం రుతువు (Season). రుతువును అనుసరించి భూభాగం, జల భాగాల మధ్య తమ దిశను మార్చుకుంటూ వీచే పవనాలే రుతుపవనాలు.
- భారత ఉపఖండం, హిందూ మహాసముద్రం మధ్య రుతువులను అనుసరించి పవనాలు వీయడాన్ని , వెనక్కు మళ్లడాన్ని మౌలికంగా ‘రుతుపవనాలు’గా పేర్కొంటారు.
- ఈ రుతుపవనాలు మార్చి నుంచి సెప్టెంబరు మధ్య ఆరు నెలలపాటు నైరుతి దిశ నుంచి, సెప్టెంబరు నుంచి మార్చి వరకు ఆరు నెలలపాటు ఈశాన్య దిశ నుంచి వీస్తాయి.
రుతువులు లేదా కాలాలు
- భారత భూభాగంపై అధిక ఉష్ణోగ్రతల వల్ల తీవ్ర అల్పపీడన వ్యవస్థ ఏర్పడుతుంది. అదే సమయంలో భూభాగాన్ని ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది.
- ఈ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతంవైపు గాలులు వీయడాన్ని ‘నైరుతి పవనాలు’ అంటారు.
- శీతాకాలంలో పీడన వ్యవస్థలు వ్యతిరేక క్రమంలో ఉండటం వల్ల పవనాలు, భూభాగం నుంచి సముద్ర భాగం వైపు ఈశాన్యం నుంచి వీస్తాయి. కాబట్టి వాటిని ‘ఈశాన్య రుతుపవనాలని’ అంటారు.
రుతువులు – నెలలు
రుతు పవనాల్లో తేడాల వల్ల దేశంలోని వివిధ భూభాగాలపై సూర్యుడి నిటారు కిరణాల ప్రసరణలోని పురోగమన, తిరోగమనాల ఆధారంగా భారతదేశ వాతావరణాన్ని నాలుగు రుతువులుగా విభజించారు.
- శీతాకాలం : డిసెంబర్ – ఫిబ్రవరి
- వేసవి కాలం : మార్చి – మే
- నైరుతి రుతుపవన కాలం : జూన్ – సెప్టెంబర్
- ఈశాన్య రుతుపవన కాలం : అక్టోబర్ -నవంబర్
పంటకాలం – నెలలు
- ఖరీఫ్ – జూన్ నుంచి సెప్టెంబర్
- రబీ – నవంబర్ నుంచి మార్చి
- జైద్ – ఏప్రిల్ నుంచి మే
శీతాకాలం
- శీతాకాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపునకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి.
- భారత్‌లో శీతాకాలాన్ని అధికంగా ప్రభావితం చేసే ప్రాంతం – మధ్యధరా సముద్రం
- భారత్‌లో శీతాకాలాన్ని హిమచల్‌ప్రదేశ్ నుంచి గంగా మైదానం మీదుగా అరుణాచల్‌ప్రదేశ్ వరకు ఏర్పడే మంచును హేజ్ అని పిలుస్తారు.
- భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబర్ మధ్య నుంచి గణనీయంగా తగ్గి ఫిబ్రవరి మధ్య వరకు అదే విధంగా ఉంటాయి. ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కార్గిల్ సమీపంలోని ద్రాస్ వద్ద అత్యల్పంగా – 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
- మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలు అంటారు.
- వీటి మూలంగా ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షపాతం సంభవిస్తుంది.
- ఈ వర్షం రబీ కాలంలో గోధుమ పంటకు చాలా ఉపయోగకరం. దేశంలో ప్రధానంగా మూడు పంట రుతువులు లేదా కాలాలున్నాయి.
- రుతుపవనకాలంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలను ‘తుఫాన్లుగా పేర్కొంటారు.
- భారతదేశంలో తుఫానులకు గురయ్యే రాష్ట్రం : ఒడిశా
- భారతదేశంలో దుమ్ము తుఫానులు వచ్చే నెల : మే
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన చక్రవాతాలు :
- హిందూమహాసముద్రం – సైక్లోన్స్
- చైనా – టైమాన్స్
- జపాన్ – టైపు
- ఆస్ట్రేలియా – విల్లీవిల్లీ
- యూఎస్ఏ – టోర్నడో
- కరేబియన్ దీవులు – హరికేన్స్
- ఫిలిప్పీన్స్ – బగువో
వేసవి కాలం
- వేసవిలో భారతదేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపు వెళ్తున్న కొద్దీ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
- ఉత్తర భారత మైదానాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపి 37 డిగ్రీల సెల్సియస్ దాటుతాయి.
- ఉత్తరాది మైదానాల్లో పొడిగా, వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి.
- వీటిని లూ(Loo) పవనాలు అంటారు.
- వేసవికాలపు ప్రధాన లక్షణం అధిక ఉష్ణోగ్రత, అల్ప ఆర్థ్రత
- వేసవి కాలంలో దేశ వాయవ్య ప్రాంతంలో అల్ప పీడన దోరణి ఏర్పడటానికి ప్రధాన కారణం సూర్యుడు కర్కటరేఖ వైపు పయనించడం.
- వేసవి కాలంలో దేశంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడుతాయి. ఈ జల్లులను రుతుపవన ఆరంభపు జల్లులు అంటారు.
వీటి మారుపేర్లు
- పంజిన్, హర్యానా -టోర్నడో
- ఉత్తరప్రదేశ్ – ఆంధీలు
- అసోం, పశ్చిమబెంగాల్ – నార్వెస్టర్స్
- ఏప్రిల్, మే నెలలో సూర్యుడు కర్కటరేఖ వైపు పయనించడం వల్ల టిబెట్ భూభాగంలో ఉష్ణోగ్రతలు పెరిగి దేశ వాయవ్య ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. ఈ ద్రోణిని ఆక్రమించడానికి బంగాళాఖాతం నుంచి దక్షిణ గాలులు, అరేబియా సముద్రం నుంచి వాయవ్య గాలులు వీస్తాయి. ఈ గాలులు సంవహనం చెంది దేశంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు లేదా, రుతుపవన ఆరంభపు జల్లులు అని పిలుస్తారు.
- సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో ‘తొలకరి జల్లులు’ పడుతాయి. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి, ఇతర పండ్లు త్వరగా పక్వానికి రావడానికి లేదా పండటానికి ఈ వానలు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్‌లో స్థానికంగా ‘మామిడి జల్లులు’ అని అంటారు. తొలకరి లేదా రుతుపవన ఆరంభ జల్లును దేశంలో ప్రాంతీయంగా వివిధ పేర్లతో పిలుస్తారు.
వివిధ రాష్ర్టాలు – సంవహన వర్షపు జల్లుల పేర్లు
- ఆంధ్రప్రదేశ్ – ఏరువాక జల్లులు
- తెలంగాణ – తొలకరి జల్లులు
- అసోం – తేయాకు జల్లులు
- కర్ణాటక – చెర్రీ బ్లోసమ్స్ / థండర్ స్టోమ్స్
- కేరళ, దక్షిణ రాష్ర్టాలు – మ్యాంగో షవర్స్
- ఉత్తర ప్రదేశ్ – అంధీలు
- పశ్చిమబెంగాల్, జార్ఖండ్ -కాలా బైశాఖీలు – నార్వెస్టర్లు
రుతుపవన కాలం
- ఉష్ణోగ్రతలోని వైవిధ్యం, అంతర అయనరేఖ అభిసరన స్థానం, ట్రోపో ఆవరణంపై భాగంలోని వాయు ప్రసరణల వల్ల రుతుపవనాలు ఏర్పడుతున్నాయి.
రుతు పవనాలు రకాలు
రుతు పవనాలు అనేవి ఒక ప్రత్యేకమైన గాలులు, వీటికి వర్షాన్నిచ్చే శక్తి ఉంది.
నీటి ఆవిరితో కూడుకుని, నియమిత కాలంలో రుతువును అనుసరించి వచ్చే పవనాలను ‘రుతు పవనాలు’ అంటారు.
రుతు పవనాలను రెండు రకాలుగా వర్గికరీంచవచ్చు. అవి.
- నైరుతి రుతుపవనాలు
- ఈశాన్య రుతుపవనాలు లేదా తిరోగమన రుతుపవనాలు.
నైరుతి రుతుపవనాలు
- ఉత్తరార్ధగోళంలో ఉన్న సైబీరియాపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడానికి దక్షిణార్ధగోళంలో ఉన్న ఆగ్నేయ వ్యాపార పవనాలు చురుకుగా వీచడం ప్రారంభిస్తాయి.
- ఇవి భూమధ్య రేఖను దాటగానే కొరియాలిస్ ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలుగా మారి, ఆసియా ఖండంపై వీచి, వర్షాన్ని కురిపిస్తాయి.
- ఈ పవనాల కారణంగానే ఆసియా ఖండం లో ఆగ్నేయ దేశాలైన భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ మొదలైన దేశాలు వర్షాన్ని పొందుతున్నాయి.
- భారత ద్వీపకల్పం ఈ పవనాలను రెండు శాఖలుగా విభజిస్తోంది. అవి : (1) అరేబియా సముద్రశాఖ. (2) బంగాళాఖాతం శాఖ. అరేబియా సముద్రశాఖ భారత పడమటి తీరాన్ని చేరి, ఉత్తర దిశగా కదులుతుంది.
- బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరాన్ని చేరి షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుంది.
1. అరేబియా సముద్రశాఖ: అరేబియా సముద్ర రుతుపవన శాఖను అరేబియా నైరుతి రుతుపవనం అంటారు. - ఈ పవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, మహారాష్ట్రలోని విదర్భ, రాజస్థాన్ ప్రాంతాలు మినహాయించి దాదాపు దేశమంతటా వర్షపాతాన్ని కలిగిస్తాయి.
- భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే సంభవిస్తోంది.
- అరేబియా సముద్రశాఖకు వర్షాచ్ఛాయా ప్రాంతంలో, బంగాళాఖాతం శాఖకు సమాంతరంగా ఉండటం వల్ల తమిళనాడులోని కోరమాండల్ తీరంలో వర్షం కురవదు.
2. బంగాళాఖాత నైరుతి రుతుపవన శాఖ : బంగాళాఖాత సముద్ర శాఖ బంగాళాఖాతం ద్వారా కదులుతూ అండమాన్ నికోబార్ దీవులను చేరుతుంది. - అక్కడి నుంచి ఒక శాఖ ఉత్తర దిశగా బెంగాల్ మైదానంలోకి వెళుతుంది.
- మరొక శాఖ ఈశాన్య దిశలో కదులుతూ మయన్మార్ దక్షిణ సరిహద్దులోని అర కాన్యోమా పర్వతాలు అడ్డగించడం వల్ల భారతదేశ ఈశాన్య ప్రాంతంలోకి ప్రవేశించి వర్షం కురిపిస్తుంది.
-టాపర్స్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

