తెలుగువారికి జియో సైన్స్ అవార్డులు – ఆర్టెమిస్ ఒప్పందాలు
ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటపుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించి స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్లను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఒక సూచన జారీ చేసింది.
విపత్తు ఘటనల ప్రసారంపై కేంద్రం స్టాంప్ తప్పనిసరి
- ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటపుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించి స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్లను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఒక సూచన జారీ చేసింది.
- ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాలు సంభవించినపుడు టీవీ చానళ్లు రోజుల తరబడి నిరంతర కవరేజీ ఇస్తుంటాయని, తొలిరోజు దృశ్యాలను ఫుటేజ్‌లో చూపిస్తూనే ఉండటం వల్ల వీక్షకులకు అనవసర గందరగోళం, భయాందోళనలు కలిగే అవకాశం ఉందని తెలిపింది.
- ఈ సూచన పాటించడం వల్ల వాస్తవంగా ఏ రోజు దృశ్యాలను ప్రసారం చేస్తున్నారో వీక్షకులకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని తెలిపింది.
- కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలను టీవీ చానళ్లు విస్తృతంగా ప్రసారం చేసిన నేపథ్యంలో కేంద్రం నుంచి తాజా సూచన వెలువడింది.
జాతీయ అంతరిక్ష దినోత్సవం

Nsd
- 2023, జూలై 14న ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న భారతదేశం నేషనల్ స్పేస్ డే (జాతీయ అంతరిక్ష దినోత్సవం)గా నిర్వహించాలని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
- ఇందులో భాగంగా అన్ని పాఠశాలలు, డైట్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు యువకుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- 2024 థీమ్: చంద్రుణ్ణి స్పృశించడం మానవ జీవితాలకు అమృత స్పర్శ : భారతదేశ అంతరిక్ష విజయ గాథ (toucing lives while touching the moon)’అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా
- ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా కేవలం రెండు శాతం (800 కోట్ల డాలర్లు). 2033 నాటికి ఇది ఎనిమిది శాతానికి (4400 కోట్ల డాలర్లకు) పెరగనుంది.
- 2035 నాటికి ప్రపంచ జీడీపీకి అంతరిక్ష పరిశ్రమ ద్వారా 1.8 లక్షల కోట్ల డాలర్ల అదనపు వాటా సమకూరుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా.
- 2032 నాటికి ఉపగ్రహ మార్కెట్ పరిమాణం 4,730 కోట్ల డాలర్లకు చేరనున్నందువల్ల ఈ రంగంలోని అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలనుకుంది.
- 2035 నాటికి అంతరిక్ష కేంద్ర నిర్మాణం, 2040కి చంద్రుడిపై భారతీయ వ్యోమగామిని దింపే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది.
- విద్యార్థులకు ప్రత్యేక విద్యా కార్యక్రమాలు, కోర్సులను ప్రవేశపెట్టి రేపటి అంతరిక్ష యుగానికి సిద్ధం చేసేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అంతరిక్ష విజ్ఞానంలో ఆరు నెలల అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్, సైన్స్ పట్టభద్రులకు ఏడాది పని అనుభవం ఉంటే, ఈ కోర్సుకు దరఖాస్తు పెట్టుకోవచ్చు.
- భారత్ ఇంతవరకు విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా 17.40 కోట్ల డాలర్లు ఆర్జించింది.
- హిందూ మహాసముద్రంలో, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రత్యర్థుల కదలికలపై నిత్యం గమనించడానికి ప్రత్యేక ఉపగ్రహ నిఘా వ్యవస్థ తోడ్పడుతుంది.
- అమెరికాకు జీపీఎస్, రష్యాకు గ్లోనాస్, ఐరోపాకు గెలీలియో, చైనాకు బైడు నిఘా ఉపగ్రహాలున్నాయి. వాటికి దీటు గా భారత్ నావిక్ వ్యవస్థను అమర్చుకొంది.
ఆర్టెమిస్ ఒప్పందాలు
- అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఆర్టెమిస్ ఒప్పందాలు ఈ దిశగా పడిన సరైన అడుగులు. అంతరిక్షాన్ని పౌరుల ప్రయోజనం కోసం శాంతియుతంగా ఉపయోగించుకోవాలని ఆర్టెమిస్ ఒప్పందాలు ఉద్దేశిస్తున్నాయి.
- 2025 నాటికి చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపాలని, 2029 నాటికి చంద్రుడి దగ్గర అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని కూడా ఈ ఒప్పందాల లక్ష్యం.
ఇస్రో విజయాల్లో షార్ పాత్ర
- 1969లో శ్రీహరికోటను రాకెట్ కేంద్రంగా ప్రకటించారు.
- 1971లో రోహిణి -125 సౌండింగ్ రాకెట్ ప్రయోగాత్మక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
- 1969-79 మధ్యకాలంలో ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు.
- తొలిసారి 1979, ఆగస్టు 10న ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం.
- 1987లో ఎస్ఎల్వీ, చిన్న ఉపగ్రహాల ప్రయోగం.
- 1993, సెప్టెంబరు 20న పీఎస్ఎల్వీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది ఇక్కడి నుంచే.
- చంద్రయాన్-1 కూడా పీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారానే ప్రయోగించారు.
- అధిక బరువున్న ఉపగ్రహాలను పంపేందుకు 2001లో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం.
2014లో జీఎస్ఎల్వీ-మార్క్ 3 ప్రయోగం
- ప్రయోగ ఖర్చును తగ్గించేందుకు 2022, ఆగస్టు 7న ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టి వాణిజ్యపరంగా దూసుకెళ్లీంది.
- ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది.
నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డులు
- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నలుగురు తెలుగువారు ‘నేషనల్ జియో సైన్స్ 2023’ అవార్డులు అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు:
1. నరసింహ మంగదొడ్డి (హైదరాబాద్ ఐఐటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్)
2. హైదరాబాద్ సీఎస్ఐఆర్ చీఫ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బంటు ప్రశాంతకుమార్ పాత్రో,
3. మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ శ్రీమత్ తిరుమల గుదిమెళ్ల రఘు కాంత్
4. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎం. ఎన్. ప్రవీణ్
- నరసింహ మంగదొడ్డి మినరల్ బెనిఫిషియేషన్, సస్టెయిన్డ్ మినరల్ డెవలప్మెంట్ విభాగంలో చేసిన కృషికి., జియోఫిజిక్స్, ఐప్లెడ్ జియోఫిజిక్స్ విభాగంలో బంటు ప్రశాంత్‌కుమార్ పాత్రో., భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు, సునామీల్లాంటి ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయడంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీమత్ తిరుమల గుదిమెళ్ల రఘుకాంత్కు రాష్ట్రపతి వ్యక్తిగత అవార్డులు అందజేసి సత్కరించారు.
- ఖనిజాన్వేషణ, శిలాజ ఇంధనం కనుక్కోవడంలో చూపిన ప్రతిభకు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన నలుగురు సభ్యుల బృందానికి ప్రకటించిన అవార్డును హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఆ సంస్థ డైరెక్టర్ ఎం.ఎన్. ప్రవీణ్ అందుకున్నారు.
అవార్డు గురించి - నేషనల్ జియోసైన్స్ అవార్డు అనేది జియోసైన్స్ రంగంలో అత్యంత పురాతన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ అవార్డుల్లో ఒకటి. దీన్ని గనుల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ద్వారా 1966లో ఏర్పాటు చేశారు.
- 2009 సంవత్సరానికి ముందు ఈ అవార్డులను నేషనల్ మినరల్ అవార్డ్స్ అని పిలిచేవారు.
- ఖనిజాల ఆవిష్కరణ, అన్వేషణ, మైనింగ్ టెక్నాలజీ మినరల్ బెనిఫిషియేషన్, ఫండమెంటల్/ఐప్లెడ్ జియోసైన్స్ వంటి రంగాల్లో అసాధారణ విజయాలు, అత్యుత్తమ సహకారాలు అందించిన వ్యక్తులకు, బృందాలకు ఈ అవార్డుని ప్రదానం చేస్తారు.
- ఏదైనా భౌగోళిక శాస్త్ర రంగంలో గణనీయమైన కృషి చేసిన భారత పౌరులు ఎవరైనా ఈ అవార్డుకు అర్హులు.
- గనుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం మూడు విభాగాల్లో నేషనల్ జియోసైన్స్ అవార్డులను అందజేస్తుంది:
1. జీవితకాల సాఫల్యానికి నేషనల్ జియోసైన్స్ అవార్డు
2. నేషనల్ జియోసైన్స్ అవార్డు
3. నేషనల్ యంగ్ జియోసైంటిస్ట్ అవార్డు - ప్రపంచ జానపద దినోత్సవం: 22 ఆగస్టు
- ఫోక్ అనే పదాన్ని 1846, ఆగస్టు 22న తొలిసారి ఉపయోగించిన విలియం జాన్ థామ్స్ అనే భాషా శాస్త్రవేత్త స్ఫూర్తితో ‘వరల్డ్ ఫోక్ లోర్ డే (ప్రపంచ జానపద దినోత్సవం)’ ను ఆగస్టు 22న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటున్నారు.
- 18వ శతాబ్దంలోనే తెలుగునాట మద్రాస్ సర్వేయర్ జనరల్‌గా నియమితులైన కల్నల్ కాలిన్ మెకంజీ.. కావలి వెంకట బొర్రయ సహకారంతో గ్రామ వివరాల సేకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో జానపదుల జీవన విధానంపై అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
- 19వ శతాబ్దంలో తెలుగువారి విశిష్ట సాహిత్యాన్ని, కళారూపాలను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి సీపీ బ్రౌన్.
- జానపద కథలు, సామెతలు, పొడుపుకథలు, పాటలు మొదలైన వాటిలో వ్యక్తీకరించిన ప్రజల లిఖిత సాహిత్యం, ఒక నిర్దిష్ట ప్రదేశం, సమూహం, కార్యాచరణ మొదలైన వాటికి సంబంధించి కథలు, ఇతిహాసాలు తెలిపేదే జానపదమని నిర్వచించారు.
- ఒక సమూహంగా జీవించే వారి జీవన విధానం జానపదం (ఫోక్).
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ సీఎస్బీ ఐఏఎస్
అకాడమీ, హైదరాబాద్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

