బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 696 ఆఫీసర్ పోస్టులు
Bank of India | వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టలు భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 10 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో
న్యూఢిల్లీ: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టలు భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 10 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 696 పోస్టులను భర్తీ చేస్తున్నది. 594 పోస్టులు రెగ్యులర్ బేసిస్ కాగా, 102 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఇందులో ఎకనమిస్ట్, స్టాటిస్టీషియన్, రిస్క్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 696
ఇందులో ఎకనమిస్ట్ 2, స్టాటిస్టీషియన్ 2, రిస్క్ మేనేజర్ 2, క్రెడిట్ అనలిస్ట్ 53, క్రెడిట్ ఆఫీసర్ 484, టెక్ అప్రైజల్ 9, ఐటీ ఆఫీసర్ 42, ఐటీ మేనేర్ 27, ఐటీ సీనియర్ మేనేజర్ 11, సీనియర్ మేనేజర్ 10, మేనేజర్ 34 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఎంబీఏ, పీజీ, బీఈ, బీటెక్, సీఏ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, గ్రూప్‌డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 26
దరఖాస్తులకు చివరితేదీ: మే 10
వెబ్సైట్: www.bankofindia.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

