TS TET 2022 | టెట్ హాల్టికెట్లలో తప్పులున్నాయా..? అయితే మార్చుకునేందుకు అవకాశం
TS TET 2022 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) హాల్‌టికెట్లు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులోకి ఉన్నాయి. అయితే మీ టెట్ హాల్టికెట్లలో తప్పులుంటే, వాటిని సరిదిద్దుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అభ్యర్థి పేరులో అక్షర దోషాలు, తల్లిదండ్రుల పేర్లలో తప్పులు, పుట్టిన తేదీ, కులం, జెండర్, డిసెబులిటీ లాంటి వివరాల్లో తప్పులున్నచో నామినల్ రోల్ కమ్ ఫోటో ఐడెంటీలో సరిచేసుకోవచ్చు. ఒక వేళ మీ హాల్ టికెట్‌పై ఫోటో, సంతకం సరిగా లేకపోయిన, పూర్తిగా లేకపోయిన.. అలాంటి అభ్యర్థులు ఇటీవల దిగిన ఫోటోపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకొని, జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి పరిశీలన అనంతరం అభ్యర్థిని ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించనున్నారు.
అభ్యర్థి ఐడీ నంబర్, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ ద్వారా అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను www.tstet.cgg.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 12న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్- 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్- 1కు 3,51,468 మంది, పేపర్- 2కు 2,77,884 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయడానికి అవకాశం కల్పించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

