హైదరాబాద్: నగరంలోని కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్ (VM Home) గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 2021-22 విద్యా సంవత్సరానికిగాను 1, రెండు, మూడో తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒకటో తరగతిలో 50 సీట్లు, 2వ తరగతిలో 50, 3వ తరగతిలో 50 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. దరఖాస్తు ఫారాలను పాఠశాల కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు.