YS Jagan | కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : వైఎస్ జగన్
YS Jagan | కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పాలనలో కేవలం అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు 10.75 శాతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, ఒకవేళ అదే నిజమైతే ప్రభుత్వ ఆదాయ వృద్ధిరేటు ఎందుకు 3.22 శాతానికి పడిపోయిందని జగన్ ప్రశ్నించారు.
YS Jagan : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పాలనలో కేవలం అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు 10.75 శాతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, ఒకవేళ అదే నిజమైతే ప్రభుత్వ ఆదాయ వృద్ధిరేటు ఎందుకు 3.22 శాతానికి పడిపోయిందని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రం నిజంగానే అభివృద్ధి చెందితే దానికి అనుగుణంగా ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ కూడా పెరగాలి కదా అని నిలదీశారు.
వైసీపీ పాలనలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా రాష్ట్రానికి రూ.85,922.23 కోట్ల ఆదాయం వచ్చిందని జగన్ గుర్తుచేశారు. గడిచిన రెండేళ్లలో సాధారణంగా ఉండాల్సిన 8 శాతం వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకున్నా 2025-26 నాటికి ఈ పన్నుల ఆదాయం రూ.1,00,219.69 కోట్లకు చేరాల్సి ఉందన్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో వాస్తవంగా వచ్చింది కేవలం రూ.86,552.68 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఈ లెక్కల ప్రకారం అంచనాల కంటే దాదాపు రూ.13,667 కోట్ల మేర రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడాన్ని చంద్రబాబు ప్రభుత్వం ‘సంపద సృష్టి’ అని ఎలా పిలుస్తుందని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

