e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News పరిశ్రమలకు స్వర్గధామం..

పరిశ్రమలకు స్వర్గధామం..

పరిశ్రమలకు స్వర్గధామం..

జిల్లాలో వెలిగిపోతున్న పారిశ్రామిక ప్రభ
ఇప్పటికే 532 వరకు భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు
తాజాగా రూ.230 కోట్లతో గాజు పరిశ్రమఏర్పాటు చేయనున్న హెచ్‌ఎస్‌ఐఎల్‌ గ్రూప్‌
700 మందికి ఉద్యోగావకాశాలు
యాదాద్రిభువనగిరి, మార్చి 24 నమస్తే తెలంగాణ ప్రతినిధి:
ఒకప్పుడు పరిశ్రమలు అంటే.. హైదరాబాద్‌ దాని చుట్టూతా ఉన్న ప్రాంతాల్లోనే ఏర్పాటయ్యేవి. పారిశ్రామిక వేత్తలు సైతం పరిశ్రమలను నెలకొల్పేందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నే ఎంచుకునే వారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్‌ఐపాస్‌ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అద్భుతాలను సృష్టిస్తోంది. అన్నీ సజావుగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతు లొచ్చేస్తున్నాయి. రవాణా సదుపాయాలు మెరుగుపడటం.. శాంతిభద్రతల సమస్యలు లేకపోవడంతో పారిశ్రామిక వేత్తలు గ్రామీణ జిల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా.. యా దాద్రి భువనగిరి జిల్లాలో పారిశ్రామిక ప్రభ వెలిగిపోతున్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమల రంగానికి స్వర్ణయుగం నడు స్తున్నది. జిల్లా ఏర్పాటు నుంచి నేటి వరకు టీఎస్‌ఐపాస్‌ ద్వారా అనుమతులు పొందేందుకు 402 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా 4,085 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 13వేలకు పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకే అవకాశం ఉందని ప్ర భుత్వం అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే 204 పరిశ్రమల స్థాపనకు అనుమతులు లభించగా, ఆయా పరిశ్రమలు రూ.2, 097 కోట్ల పెట్టుబడులతో తమ ఉత్పత్తులను సైతం ప్రారంభిం చగా, వాటిల్లో 5,403 మంది ఉపాధి పొందుతున్నారు.


గాజు పరిశ్రమతో 700 మందికి ఉద్యోగావకాశాలు
గాజు సీసాల తయారీలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన హిం దూస్థాన్‌ శానిటరీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఐఎల్‌)కు అను బంధ సంస్థగా ఉన్న ఏజీఐ సంస్థ రూ.230 కోట్ల వ్యయంతో గాజు ప్లాంట్‌ను నెలకొల్పబోతున్నది. ఇప్పటికే ఆ సంస్థ భువన గిరిలో బాటిళ్ల తయారీ పరిశ్రమను, బీబీనగర్‌లో సిరామిక్‌ ఇం డస్ట్రీని నిర్వహిస్తున్నది. అలాగే సనత్‌నగర్‌లో గాజు సీసాల త యారీ పరిశ్రమను, ఇస్నాపూర్‌లో ప్లాస్టిక్‌ సెక్యూరిటీ క్యాప్స్‌ పరి శ్రమను నిర్వహిస్తున్నది. మద్యం, రసాయనాలు, ఆహార పదా ర్థాలు, వంట నూనెలు, ఔషధాలను ఉంచే బాటిళ్లు, గ్రీన్‌డ్రాప్‌ గ్లాస్‌వేర్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ ఫుడ్‌ జార్స్‌ తదితర వాటిని ఈ సంస్థ తయారు చేస్తూ వివిధ రకాల బేవరేజెస్‌, ఆహార పదా ర్థాల తయారీ సంస్థలకు సరఫరా చేస్తున్నది. పలు బహుళ జాతి సంస్థలు ఏజీఐ గ్లాస్‌పాక్‌ బాటిళ్లనే వినియోగిస్తున్నాయి.

ప్రస్తు తం గ్లాస్‌పాక్‌ సంస్థలో 3వేల మంది వరకు పనిచేస్తుండగా, కొ త్తగా భువనగిరిలో 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మరో బాటి ల్స్‌ ప్లాంట్‌తో 700 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే హెచ్‌ఎస్‌ఐఎల్‌ గ్రూ ప్‌ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం తనను కలిసిన గ్రూప్‌ ఎండీ సందీప్‌ సో మానీని ఐటీ మంత్రి కేటీఆర్‌ సత్కరించి జ్ఞాపికను సైతం అం దజేశారు. త్వరలోనే ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి సన్నా హాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికా రులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎంఎస్‌ఎన్‌ కంపెనీ, ఆహార పదార్థాల తయారీకి సంబంధించి బాంబినో కంపెనీ, శ్రి యం ల్యాబ్స్‌ వంటి ఎన్నో ప్రముఖ కంపెనీలు బీబీనగర్‌ ప్రాం తంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. బీబీనగర్‌ ప్రాం తంలో కొనసాగుతున్న జైన్‌ కంపెనీ, చౌటుప్పల్‌ ప్రాంతంలో దివీస్‌, శ్రీని వంటి పెద్ద ఫార్మా కంపెనీలతోపాటు మరో 50 వరకు చిన్నచిన్న ఫార్మా కంపెనీలు కొనసాగుతున్నాయి. వీటిల్లో వేల మంది ఉపాధి పొందుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణా లతో చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కుతో 15వేల మందికి ప్రత్యక్షంగా.. మ రో 20వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది. ఈ నేప థ్యంలోనే అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న హెచ్‌ఎస్‌ఐఎల్‌ వంటి సంస్థలు జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో యాదాద్రి జిల్లా త్వరలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అడ్డాగా నిలవనున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పరిశ్రమలకు స్వర్గధామం..

ట్రెండింగ్‌

Advertisement