ప్రపంచంలో తొలి ఫ్లైయింగ్ బైక్ ఎంట్రీ!
ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది.
న్యూయార్క్ : ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను కంపెనీ ఎక్స్రిస్మో హోవర్బైక్గా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది ఈ మోడల్‌ను లాంఛ్ చేసేందుకు ఏర్‌విన్స్ సన్నాహాలు చేపడుతోంది. హోవర్‌బైక్ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాల పాటు ప్రయాణిస్తుంది.
This is the world's first flying bike. The XTURISMO hoverbike is capable of flying for 40 minutes and can reach speeds of up to 62 mph pic.twitter.com/ZPZSHJsmZm
— Reuters (@Reuters) September 16, 2022
జపాన్‌లో ఫ్లైయింగ్ బైక్ ఇప్పటికే సేల్‌లో ఉంది. 2023లో స్మాలర్ వెర్షన్‌ను అమెరికాలో విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏర్‌విన్స్ వ్యవస్ధాపక సీఈవో షుహి కొమట్సు వెల్లడించారు. అయితే హోవర్‌బైక్ ధర రూ 6 కోట్లు పైమాటే. చిన్న ఎలక్ట్రిక్ మోడల్ ధరను తక్కువ ధరకు అందిస్తామని, అయితే ఇది మరో మూడేండ్లలో 2025 నాటికి సిద్ధమవుతందని చెప్పారు.
హోవర్‌బైక్‌ను టెస్ట్ రైడ్ చేసిన డెట్రాయిట్ ఆటో షో కో చీఫ్ టాడ్ సాట్ ఇది మరపురాని అనుభూతిని మిగిల్చిందని, చాలా సౌకర్యవంతంగా ఉందని, సైఫీ మూవీ సన్నివేశంలా అనిపించిదని అన్నారు. తాను 15 ఏండ్ల బాలుడిలా ఫీల్ అయ్యానని, తాను స్టార్ వార్స్‌ను బయటకు వచ్చి వారి బైక్‌పై జంప్ చేసినట్టు అనిపించిందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- debut
- flying bike
- US auto show
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

