Woman | హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ (Faridabad)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 25 ఏండ్ల యువతి (Woman)పై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. కదులుతున్న కారులో దాదాపు రెండు గంటల పాటూ అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సోమవారం సాయంత్రం సదరు మహిళ తన తల్లితో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాత్రి 8:30 గంటల సమయంలో తన సోదరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. మూడు గంటల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పింది. అనంతరం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై వాహనం కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళను కారులోకి లాక్కొని వెళ్లిపోయారు. అనంతరం దాదాపు రెండున్నర గంటలపాటూ కదులుతున్న కారులోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రాజ్చౌక్ (Raja Chowk)వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటనలో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కూడా అవుతోంది.
మహిళ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమెకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయితే, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో యువతి తన సోదరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకొని బాధితురాలిని విషమ పరిస్థితిలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె ముఖంపై 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
సదరు మహిళకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, కొన్ని గొడవల కారణంగా భార్యా భర్తలు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు బాధితురాలి సోదరి తెలిపింది. ఈ మేరకు ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు.
Also Read..
Bus Catches Fire | టూరిస్ట్‌లతో వెళ్తున్న బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం
Contaminated Water | కలుషిత నీరు తాగి ఎనిమిది మంది మృతి.. 100 మంది పరిస్థితి విషమం
India | మూడో పక్షం జోక్యం లేదు.. ఇండోపాక్ ఉద్రిక్తతలపై చైనా ప్రకటనను తిరస్కరించిన భారత్